వికారాబాద్, నవంబర్ 14 : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత రోజురో జుకూ పెరుగుతున్నది. కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మంగల్‌పల్లిలో 8.7 డిగ్రీలు, వికారాబాద్ జిల్లాలోని మోమిన్‌పేట మండలంలో 8.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
ఉత్తరాది నుంచి వీచే గాలుల ప్రభావంతోనే తెలంగాణలో చలి తీవ్రత పెరిగిందని అధికారులు తెలిపారు. జిల్లాలోని ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. గ్రామాల్లో చలి తీవ్రతను తట్టుకునేందుకు ఉదయం, సాయంత్రం సమయాల్లో చలి మంటలు వేసుకుంటున్నారు.