శంకర్పల్లి జూన్ 27 : రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని చేవెళ్ల ఎమెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల కేంద్రంలో డీసీఎంఎస్ దుకాణాల సముదాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం రైతు బంధు, రైతుబీమా లాంటి పథకాలు ప్రవేశ పెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
రైతులు సాగుపై చర్చించేందుకు రైతు వేదికలను సైతం నిర్మించామని ఆయన గుర్తు చేశారు. ఉచిత కరెంట్, సరిపడా నీళ్లు, ధాన్యం కొనుగోళ్లతో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుకు సంక్షేమానికి అనునిత్యం పాటుపడుతుందన్నారు.
కార్యక్రమంలో మున్సిల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్‌కుమార్,ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, జెడ్పీటీసీ గోవిందమ్మ, పీఏసీఎస్ చైర్మన్ శశిధర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.