ఇబ్రహీంపట్నం, నవంబర్ 13 : సమస్యల పరిష్కారానికి గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో ఉద్యమా లే శరణ్యమని భావించారు ఇబ్రహీంపట్నం ప్రజలు. కానీ.. తెలంగాణ ఏర్పాటై కేసీఆర్ సీఎం అయిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో సకల సౌకర్యాలు సమకూరడంతో వారు అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నారు. గత పాలకుల హయాంలో తాగునీరు, విద్యావైద్యం, రోడ్ల అభివృద్ధి తదితర సమస్యలను పరిష్కరించాలని ప్రజలు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను చేపట్టేవారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పదేండ్ల పాలనలో మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ తాగునీరు సరఫరా.. మిషన్ కాకతీయతో చెరువులు, కుంట ల్లో మరమ్మతులతోపాటు పూడికతీత తీయడంతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. మన ఊరు-మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వ బడులను బాగు చేయుట..రైతుబంధు పెట్టుబడి సాయాన్ని అందించి అప్పుల తిప్పలను తప్పించడంతో అన్నదాతలు ఏ టెన్షన్ లేకుండా వ్యవసాయాన్ని చేసుకుంటున్నారు. అయితే గత పదేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో ఐదుసారు పర్యటించి దాదాపుగా రూ. 2931 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అమలు చేసి రాష్ట్రంలోనే ఆదర్శ సెగ్మెంట్‌గా ఇబ్రహీంపట్నాన్ని నిలిపా రు. కాగా నేడు సీఎం కేసీఆర్ మరోమారు ఇబ్రహీంపట్నానికి విచేస్తున్న సందర్భంగా మరిన్ని అభివృద్ధ్ది పనులకు నిధులను కేటాయిస్తారని స్థానిక ప్రజలు ఆశిస్తున్నారు.
అభివృద్ధి చేశా.. మరోసారి ఆశీర్వదించండి
నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ చొరవతో వేలా ది కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టా. మరోమారు అవకాశమిస్తే మరింత అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ సెగ్మెంట్‌గా ఇబ్రహీంపట్నాన్ని నిలుపుతా. ఇబ్రహీంపట్నం నుంచి మాల్ వరకు నాలుగు వరుసల రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేయడంతోపాటు శివన్నగూడ ఎత్తిపోతల ద్వారా 84 వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తా. అలాగే ఎల్బీనగర్ నుంచి బొంగుళూరు వరకు.. ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్‌పేట వరకు మెట్రోరైలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తా. జాపాల్, రంగాపూర్‌లలో నక్షత్రశాలకు చెందిన 200 ఎకరాలలో ఇం జినీరింగ్, పీజీ కళాశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటా. పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలను తీసుకొచ్చి రానున్న మూడేండ్ల కాలంలో 30 వేల మంది స్థానిక నిరుద్యోగ యువతీయువకులకు ఉద్యోగాలు కల్పిస్తా. ఎలిమినేడు, బలిజగూడ, తాళ్లపల్లిగూడ, మొండిగౌరెల్లి గ్రామాల్లో ఎలక్ట్రానిక్ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటా. నూతనంగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లోని అన్ని వార్డుల్లో రూ. వంద కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తా.
-మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే
నియోజకవర్గంలో గత పదేండ్లలో జరిగిన అభివృద్ధి పనులు
సెగ్మెంట్లోని లబ్ధిదారులకు వివిధ పథకాల ద్వారా అందిన ఆర్థిక సాయం