కడ్తాల్, ఏప్రిల్ 2: మండలంలో పదో తరగతి పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. మండల కేంద్రంలోని బాలుర, బాలికల ఉన్నత పాఠశాలతోపాటు, ముద్విన్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్ష ఆఖరి రోజు మొత్తం 526 మంది విద్యార్థులగానూ అందరూ హాజరైనట్లు ఎంఈవో సత్యనారాయణ, సీఎస్‌లు చందులాల్, ఝాన్సీలక్ష్మి, కృష్ణయ్య, డిపార్ట్మెంట్ అధికారులు రాధాకృష్ణారెడ్డి, వెంకటరమణరెడ్డి, విష్ణుమూర్తి తెలిపారు. పరీక్షలు చివరి రోజు కావడంతో విద్యార్థులు కేరింతలు వేశారు.
కేశంపేట : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన పదో తరగతి పరీక్షలు కేశంపేట మండలంలో బుధవారంతో ప్రశాంతంగా ముగిశాయి. కేశంపేట జెడ్పీహెచ్ఎస్లో 190మంది విద్యార్థులు వశిష్ఠ పాఠశాలలో 178, కొత్తపేట జెడ్పీహెచ్ఎస్లో 180మంది పరీక్షలు రాశారని, మండలంలోని 16పాఠశాలలకు చెందిన 548మంది విద్యార్థులకు అందరు హాజరైనట్లు మండల విద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు. ఆయా పరీక్షా కేంద్రాలవద్ద 144 సెక్షన్ అమలులో ఉన్న కారణంగా సీఐ నరహరి పర్యవేక్షణలో ఎస్ఐ రాజ్‌కుమార్, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.