కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్, చమురు ధరలను అడ్డగోలుగా పెంచడంపై టీఆర్ఎస్ భగ్గుమన్నది. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ గురువారం పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గ్యాస్ సిలిండర్లతో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. పలుచోట్ల కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలు, స్థానిక ఎమ్మెల్యేలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడుతూ కేంద్రం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. ఎన్నికలు ముగియగానే మళ్లీ వరుసగా ధరలు పెంచుతూ కేంద్రం ప్రజలపై మోయలేని భారం మోపుతున్నదన్నారు. పెద్దలకు కొమ్ముకాస్తూ పేదల నడ్డి విరుస్తున్నదన్నారు. పెరిగిన ధరలతో సామాన్యులు విలవిలలాడుతున్నారని, వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పెంచిన వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంత్రి సబితారెడ్డితో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, సామాన్యులు గురువారం ఖాళీ సిలిండర్లతో నిరసనలు తెలిపారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెంచిన ధరలతో వినియోగదారులపై పెనుభారం పడుతుందన్నారు. ధరలను తగ్గించకుంటే కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఇప్పటికైనా వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.
– న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ, మార్చి 24
ఇబ్రహీంపట్నం, మార్చి 24 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంటగ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం ధరల పెంపును నిరసిస్తూ టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారిలోని బొంగుళూరు ఔటర్‌రింగ్‌రోడ్డు వద్ద రస్తారోకో నిర్వహించారు. అనంతరం ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. సిలిండర్‌పై యాభై రూపాయలు పెంచటం బాధాకరమన్నారు. అలాగే, పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ఇష్టానుసారంగా పెంచుతున్నారని, దీంతో నిత్యావసర వస్తువుల పైన కూడా ప్రభావం పడుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రతి రెండు నెలలకోసారి వంటగ్యాస్ ధరలు పెంచుతున్నదన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, ఎంపీపీలు కృపేశ్, నర్మద, జడ్పీటీసీ జంగమ్మ, మున్సిపల్ చైర్పర్సన్లు స్రవంతి, స్వప్న, వైస్‌చైర్మన్ ఆకుల యాదగిరి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు భరత్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు బుగ్గ రాములు, రమేశ్, రమేశ్‌గౌడ్, పార్టీ మున్సిపల్ అధ్యక్షులు వెంకట్‌రెడ్డి, కొప్పు జంగయ్యతో పాటు టీఆర్ఎస్ నాయకులు రాజు, రాజేశ్ పాల్గొన్నారు.
పరిగి, మార్చి 24 : పెంచిన వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధరల పెంపునకు నిరసనగా టీఆర్ఎస్ అధిష్టానం పిలుపు మేరకు గురువారం పరిగిలోని కొడంగల్ క్రాస్‌రోడ్డులో ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. అంతకుముందు బృందావన్ గార్డెన్ నుంచి కొడంగల్ క్రాస్‌రోడ్డు వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల వివిధ రాష్ర్టాల్లో ఎన్నికలు ఉండడంతో కొద్ది రోజులు ధరలు పెంచకుండా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఎన్నికలు పూర్తయ్యేసరికి వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఇష్టానుసారంగా పెంచుతున్నదని విమర్శించారు. వీటి పెంపకం ద్వారా సామాన్యులపై మోయలేని భారం పడుతున్నదని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో రవాణాపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి పెంచిన వంటగ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్‌రెడ్డి, జడ్పీటీసీలు కె.నాగారెడ్డి, బి.హరిప్రియ, మేఘమాల, నాయకులు కొప్పుల అనిల్‌రెడ్డి, ఎంపీపీలు అరవిందరావు, సత్యమ్మ, అనసూజ, మార్కెట్ కమిటీ చైర్మన్లు ఎ.సురేందర్, హరికృష్ణ, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, పీఏసీఎస్ చైర్మన్ కె.శ్యాంసుందర్‌రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
షాబాద్, మార్చి 24 : రోజురోజుకూ ధరలు పెంచి పేదలపై పెనుభారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినందుకు నిరసనగా గురువారం చేవెళ్ల మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలుమార్లు నిత్యావసర సరుకుల ధరలతో పాటు వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నదని మండిపడ్డారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులకు ఆర్థిక ఇబ్బందులు తప్పవన్నారు. కేంద్రం వెంటనే స్పందించి ధరలను తగ్గించాలని, లేనిపక్షంలో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కె.ఎస్ రత్నం, ఆయా మండలాల జడ్పీటీసీలు పట్నం అవినాశ్‌రెడ్డి, మర్పల్లి మాలతీ, కాలె శ్రీకాంత్, గోవిందమ్మ, కాలె జయమ్మ, ఎంపీపీలు మల్గారి విజయలక్ష్మి, కోట్ల ప్రశాంతిరెడ్డి, గోవర్దన్‌రెడ్డి, కాలె భవాని, గునుగుర్తి నక్షత్రం, మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి, టీఆర్ఎస్ ఆయా మండలాల అధ్యక్షులు ప్రభాకర్, నర్సింగ్‌రావు, మహేందర్‌రెడ్డి, గోపాల్, నాగిరెడ్డి, వాసుదేవ్‌కన్నా, మార్కెట్ కమిటీ చైర్పర్సన్లు పి.స్వప్ననర్సింహారెడ్డి, శివనీల, బుచ్చిరెడ్డి, పార్టీ నాయకులు ప్రభాకర్‌రెడ్డి, అనంతరెడ్డి, రాంరెడ్డి, కృష్ణారెడ్డి, రామేశ్వర్‌రెడ్డి, నాగార్జునరెడ్డి, మాణిక్యరెడ్డి, శేఖర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, జయవంత్, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
తాండూరు, మార్చి 24 : దేశ ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక్క సంక్షేమ పథకం చేపట్టలేదని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. గురువారం పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని తాండూరు పట్టణంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలు 150కి పైగా ఉన్నాయని గుర్తు చేశారు. బీజేపీ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నదని, తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వికారాబాద్, మార్చి 24 : కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు పెంచి, సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నదని టీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. గురువారం వికారాబాద్ పట్టణంలో రోడ్డుపై నిరసన చేపట్టి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ నిరుపేద ప్రజలను ఇబ్బందులకు గురి చేసేలా కేంద్ర ప్రభుత్వం పలు మార్లు ధరలు పెంచుతుందన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, ఆయా మండలాల ఎంపీపీలు వసంత, శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీలు ప్రమోదిని, మధుకర్, సుజాత, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కమాల్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, రాజునాయక్, వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం.దీప, పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శంషాద్‌బేగం, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేపట్టారు. వికారాబాద్‌లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, తాండూరులో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, పరిగిలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, కొడంగల్‌లో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఈ ధర్నాల్లో పాల్గొన్నారు. గ్యాస్ సిలిండర్లతో రోడ్లపై ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా పెంచిన వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలతో సామాన్యులపై మోయలేని భారం పడుతుందని వారు పేర్కొన్నారు.
కొడంగల్, మార్చి 24 : కేంద్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. గ్యాస్, పెట్రోల్ పెంపునకు నిరసనగా అంబేద్కర్ కూడలిలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఖాళీ గ్యాస్ సిలిండర్లతో పాటు కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం గ్యాస్‌పై రూ.50, పెట్రోల్‌పై 90పైసలు పెంచడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరిని అవలంబిస్తూ ప్రజాసంక్షేమాన్ని విస్మరిస్తుందని ఆరోపించారు. పెంచిన గ్యాస్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీలు ముద్దప్ప దేశ్ముఖ్తో పాటు టీఆర్ఎస్ నాయకులు దామోదర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, మధుసూదన్‌యాదవ్, ఉషారాణి, కోట్ల మహిపాల్, విజయ్‌కుమార్, కోట్ల యాదగిరి, నారాయణరెడ్డి, బాల్‌సింగ్‌నాయక్, దేశ్యనాయక్, కృష్ణ, విష్ణువర్దన్‌రెడ్డి, కటకం శివకుమార్, బస్వరాజ్, మహేందర్‌రెడ్డి, దత్తురెడ్డి, టీటీ రామునాయక్ పాల్గొన్నారు.