రంగారెడ్డి, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో మున్సిపల్ పీఠాలను దక్కించుకునేందుకు జోరు గా క్యాంపు రాజకీయాలు కొనసాగుతు న్నాయి. గెలుపొందిన కౌన్సిలర్లను కాపాడుకునేందుకు ఆ కేంద్రాలకు ఆయా పార్టీలు తరలించాయి. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఇబ్రహీంపట్నం, ఆమనగల్లులో బీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ ఉన్నది. అయినా ఈ రెండు మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్‌కు బలం లేకపోయినా క్యాంపు రాజకీయాలు చేస్తున్నది. ఎక్స్అఫీషియో ఓట్లతో చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆమనగల్లు మున్సిపాలిటీలో 15 వార్డులుండగా.. 8 వార్డుల్లో బీఆర్ఎస్, ఆరు వార్డుల్లో బీజేపీ, ఒకచోట కాంగ్రెస్ గెలుపొందింది.
దీంతో హస్తం పార్టీ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా బీజేపీతో జత కట్టి.. బీజేపీకి చైర్మన్ పీఠాన్ని కట్టబెట్టేందుకు యత్నాలు చేస్తున్నది. ఇందుకోసం ఎమ్మెల్యే, బీజేపీకి చెందిన ఎమ్మెల్సీ ఎక్స్అఫీషియో ఓట్లతో ఆమనగల్లు మున్సిపల్లో పాగాకు కుత్రాలు జరుగుతున్నాయి. అలాగే, మొయినాబాద్ మున్సిపాలిటీలోనూ జోరుగా క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి. ఇక్కడా అత్యధికంగా ఐదుగురు ఇండిపెండెం ట్ అభ్యర్థులు గెలుపొందారు. వారిని తమవైపు తిప్పుకొని మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేందుకు మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి రంగంలోకి దిగారు. ఈ మున్సిపాలిటీలో 26 వార్డులుండగా బీఆర్ఎస్కు 6 స్థానాలు రావడం తో బీజేపీ, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకోవ టం కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నది.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు బలం లేకపోయినా ఆ పార్టీ నుంచి గెలుపొందిన 8 మంది కౌన్సిలర్లతో క్యాంపులు ఏర్పాటు చేసింది. ఎక్స్అఫీషియో సభ్యులతోపాటు బీజేపీ నుంచి గెలుపొందిన ఇద్దరిని కలుపుకోవాలని య త్నాలు చేస్తున్నది. కాగా, బీఆర్ఎస్పార్టీ నుంచి 13 మంది కౌన్సిలర్లుగా గెలుపొందారు. కాంగ్రెస్‌కు చెందిన రెబెల్ అభ్యర్థి కూడా బీఆర్ఎస్ క్యాంపులో చేరాడు. దీంతో ఆ పార్టీకి 14 మంది కౌన్సిలర్లతో స్పష్టమైన మెజార్టీ ఉన్నది. అయినా కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలకు తెరలేపడంతో బీఆర్ఎస్ అప్రమత్తమైంది.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు బీఆర్ఎస్కు 14 మంది కౌన్సిలర్లతో స్పష్టమైన మెజార్టీ ఉన్నది. ఫలితాల అనంతరం క్యాంపులో ఉన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లపై స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితోపాటు ఆయన అనుచరులు ఓడిపోయామన్న ప్రస్టేషన్లో అసత్య ప్రచారం చేస్తున్నారు. పట్నం మున్సిపల్ చైర్మన్‌తోపాటు వైస్‌చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సారథ్యంలో మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తాం.
-సత్తు వెంకటరమణారెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్