ఇబ్రహీంపట్నం మార్చి 9 : రాష్ట్రంలో భవిష్యత్తు బీఆర్ఎస్(Brs)పార్టీదేనని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలం బండరావిరాల గ్రామానికి చెందిన పలువురు బీఎస్పీ పార్టీ(BSP leaders) నాయకులు, కార్యకర్తలు ఆదివారం రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి(బంటి)సమక్షంలో భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..రాష్ట్రంలో భవిష్యత్తు బీఆర్ఎస్ దేనని అన్నారు.
కాంగ్రెస్ ను నమ్మి ప్రజలు ఓట్లేస్తే నట్టేట ముంచారని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో ఏ ఒక్కరికి చిన్న ఇబ్బంది కలగకుండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలను ఆదుకున్నారని పేర్కొన్నారు. ఎండాకాలం సరిగా ప్రారంభం కాకముందే రాష్ట్రంలో కరువు విలయాతండవం ధవం చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.