అధికార పార్టీ అదిరేలా..
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీకి గట్టి పోటీనిచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నా కాంగ్రెస్‌కు షాకిచ్చింది. కొడంగల్, తాండూరు ము న్సిపాలిటీలు మినహాయిస్తే మిగతా వికారాబాద్, పరిగి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఎన్నికలు హోరాహోరీగా సాగాయి.
- 31 వార్డుల్లో బీఆర్ఎస్ విజయం
- పరిగిలో అధికార పార్టీకి దీటుగా గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థులు
- వికారాబాద్‌లో మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోని హస్తం పార్టీ
- తాండూరులోనూ గట్టి పోటీ
వికారాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీకి గట్టి పోటీనిచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నా కాంగ్రెస్‌కు షాకిచ్చింది. కొడంగల్, తాండూరు ము న్సిపాలిటీలు మినహాయిస్తే మిగతా వికారాబాద్, పరిగి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. తాండూరు, కొడంగల్ మున్సిపాలిటీల్లో మ్యాజిక్ ఫిగర్ దాటినా .. వికారాబాద్, పరిగి మున్సిపాలిటీల్లో మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోలేకపోవడం గమనార్హం. మరోవైపు ఓట్ల లెక్కింపు షురూ అయినప్పటి నుంచి పరిగి, తాండూరు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా ఫలితాలొచ్చాయి.
మొదటి రౌండ్ పూర్తయ్యే వరకు వికారాబాద్, తాండూరు, పరిగి మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ వార్డుల్లో ఆధిక్యంలో ఉండగా, రెండో రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యం ప్రదర్శించగా మూడో రౌండ్ వచ్చే వరకు పరిగిలో హోరాహోరీగా ఫలితా లు వచ్చాయి. అసలు పోటీయే కాదు అని మాట్లాడిన కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ అభ్యర్థులు ఆయా మున్సిపాలిటీల్లోని పలు వార్డుల్లో గట్టిగా షాకిచ్చారు. మరోవైపు జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ పెట్టి వరాలు కురిపించడంతోపాటు ఇతర పార్టీల నుంచి గెలిచిన వారికి నిధులివ్వమని స్పీకర్ బెదిరింపులకు పాల్పడినా చావు తప్పి కన్ను లొట్టపోయిందనేలా కాంగ్రెస్‌కు ఫలితాలు వచ్చాయనే అభిప్రా యం వ్యక్తమవుతున్నది.
పరిగిలో బహిరంగ సభ పెట్టినా పరిగి మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడగా, పోలీసులను అడ్డం పెట్టుకొని ఇండిపెండెంట్ అభ్యర్థులను ఎత్తుకుపోయే పరిస్థితులు రావడంపై కాం గ్రెస్ పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో బీజేపీ పుంజుకున్నది. ఎంఐఎంకు గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో సగానికిపైగా వార్డులు తగ్గాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధారాసింగ్‌కు తాండూరు మున్సిపాలిటీ ప్రజలు షాకిచ్చారు. ఆ మున్సిపాలిటీలోని 13వ వార్డు నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ధారాసింగ్ సోదరుడు రామూనాయక్ బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యాడు
అస్సాం తరలింపు..
పరిగి : పరిగి మున్సిపల్ పరిధిలోని మూడో వార్డులో గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి ముడావత్ హన్మంతును అస్సాం తరలించారనే ప్రచా రం జరుగుతున్నది. బీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థి హన్మంతు గెలుపొందగా బీఆర్ఎస్ నాయకులు ఆయన్ను కలవకుండా నిలువరించారనే విమర్శలున్నాయి. పోలీసులు తమ రక్షణలో పెట్టుకున్న హన్మంతును పోలీసు వాహనంలో తీసుకువెళ్లి అధికార పార్టీకి అప్పగించారని ప్రచారంలో ఉన్న ది. మరో వాహనంలో అధికార పార్టీ వారు అతడిని అస్సాం తరలించినట్లు ప్రచారం జరుగుతుం ది. ఈనెల 16న నేరుగా ప్రమాణస్వీకారానికి హాజరై ఓటు వేసేలా ప్లాన్ చేసినట్లు సమాచారం.
అన్నాచెల్లెళ్ల విజయం..
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అన్నాచెల్లెలు ఇద్దరూ విజయం సాధించారు. పరిగి మున్సిపాలిటీలోని పదోవార్డు నుంచి రవికుమార్, ఆయన చెల్లెలు జ్యోతీసురేశ్వికారాబాద్ మున్సిపాలిటీలోని 14వ వార్డు నుంచి ఇరువురు బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

