ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 15: తెలంగాణలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేండ్లలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి, ప్రజలు ఆర్థికంగా ఎదగడానికి ఎంతో కృషి చేసిందన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలిపామన్నారు. చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరు పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, నోముల కృష్ణగౌడ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య, ఎంపీపీలు కృపేశ్, నర్మద, జడ్పీటీసీలు జంగమ్మ, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, నాలుగు మండలాలు, మున్సిపాలిటీల అధ్యక్ష, కార్యదర్శులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
యాచారం : మండలంలోని నందివనపర్తి గ్రామంలో కొలువుదీరిన నందీశ్వరాలయంలో ఎన్నో ఏండ్లుగా వస్తున్న తన ఆనవాయితిని కొనసాగిస్తూ ఆదివారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ఉన్న మహానంది, శివలింగాలకు ఆయన అభిషేకం నిర్వహించిన అనంతరం పూజలు నిర్వహించారు. నందీశ్వరుడి చెవిలో రానున్న ఎన్నికల్లో అంతా మంచి జరిగేలా ఆశీర్వదించాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కోరుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన కోరారు. ప్రతిపక్షాలకు మరోసారి భంగపాటు తప్పదన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జంగమ్మ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్, ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి భాష, సర్పంచ్‌లు ఉదయశ్రీ, శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తలారి మల్లేశ్, శంకర్‌నాయక్, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ యాదయ్య, డైరెక్టర్ మక్కపల్లి స్వరూప, నాయకులు బిలకంటి శేఖర్‌రెడ్డి, చిన్నోళ్ల యాదయ్య, రాజు, యాదయ్యగౌడ్, ఖాజు, వెంకటేశ్ పాల్గొన్నారు.
సాయిశరణం ఫంక్షన్ హాల్లో సోమవారం బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని ఉదయం 11గంటలకు నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్‌గౌడ్ తెలిపారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.