ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 14 : వరంగల్‌లో ఈ నెల 27న జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేసేందు కు అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా తరలిరావాలని ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షు డు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
సోమవారం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాలతోపాటు ఇబ్రహీంప ట్నం, తుర్కయాంజాల్, ఆదిబట్ల, పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీల అధ్యక్ష, కార్యదర్శు లు, ముఖ్య నాయకులతో ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అన్ని మున్సిపాలిటీలు, మండలాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివెళ్లేందుకు ప్రత్యేకంగా బస్సులు, కార్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కృపేశ్, మున్సిపల్ మాజీ చైర్మన్ భరత్‌కుమార్, మాజీ ఎం పీటీసీ భరత్‌రెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ యువత అధ్యక్షుడు జెర్కోని రాజు, రాజేందర్‌రెడ్డి, బీఆర్ఎస్వీ మున్సిపల్ అధ్యక్షుడు శివసాయి, మున్సిపల్ అధ్యక్షుడు వెంకట్రె డ్డి, జంగయ్య, మండలాల అధ్యక్షులు బుగ్గ రాములు, రమేశ్‌గౌడ్, నాయకులు పాశ్చ బాష, భాస్కర్, శంకర్ తదితరులున్నారు.