చేవెళ్ల రూరల్, జనవరి 3 : బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా కృషి చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. శుక్రవారం చేవెళ్ల మండల పరిధిలోని కేసారం గ్రామ రెవెన్యూలోని బృందావన్‌కాలనీలో శ్రేణులతో సమావేశం నిర్వహించి పలు సలహాలు, సూచనలు చేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలంటూ ప్రజలను మభ్యపెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నదన్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ మోసాలను ఎండగట్టాలన్నారు. సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ పట్లొళ్ల కృష్ణారెడ్డి, రాష్ట్ర కనీస వేతన సలహామండలి మాజీ చైర్మన్ పీ నారాయణ, తెలంగాణ ఉద్యమకారుడు దేశమల్ల ఆంజనేయులు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, బీఆర్ఎస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు వంగ శ్రీధర్‌రెడ్డి, నాయకులు విఘ్నేశ్ గౌడ్, బ్యాగరి సుదర్శన్ తదితరులు ఉన్నారు.
– మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి