మంచాల, జూలై 5 : పేదల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధి ఇబ్రహీంపట్నంలో ఉన్న క్యాంపు ఆఫీస్‌లో ప్రజలకు అందుబాటు లో ఉండకపోగా.. నిత్యం ల్యాండ్ సెటిల్మెం ట్లు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండలంలోని లింగంపల్లి గేట్ వద్ద డబుల్‌బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులను కాంగ్రెస్ నాయకుల బెదిరింపులు, పోలీసుల వేధింపుల విషయం తెలుసుకున్న ఆయన శనివారం ఆ ఇండ్ల వద్దకు చేరుకుని మేమున్నామనే భరోసా కల్పించారు.
ముందుగా ఆయన ఈ ఇండ్లలోని సమస్యలను లబ్ధిదారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భం గా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ.. కాం గ్రెస్ పార్టీ వారు వచ్చి మీరు ఇండ్లు ఖాళీ చేసి వెళ్తేనే ఆ ఇండ్లలోని సమస్యలను పరిష్కరిస్తామని..లేకుంటే ఆ ఇండ్లను వేరే వారికి కేటాయిస్తామని బెదిరిస్తున్నారని.. పోలీసులు ప్రతిరో జూ వచ్చి తమ పేర్లు అడుగుతూ ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో తాగునీరు, కరెంట్ సమస్యలను పరిష్కరించడంతోపాటు పట్టా సర్టిఫికెట్లను ఇవ్వమంటే అధికారులు పట్టించుకోవడంలేదని కిషన్‌రెడ్డి ఎదుట కంటతడి పెట్టారు.
అభివృద్ధి పట్టదా..?
ప్రజలు వివిధ సమస్యలతో సతమతమవుతుంటే.. స్థానిక ఎమ్మెల్యే వాటిని పట్టించుకోకుండా ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తూ నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించిన అనంతరం లబ్ధిదారులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత కేసీఆర్ ప్రభుత్వం నిరుపేదల కోసం డబుల్బెడ్రూమ్ ఇండ్లను నిర్మించడమే కాకుండా 96 మందికి లాటరీ ద్వా రా ఆర్డీవో, తహస్దీలార్లు వారికి ఇండ్లను కేటాయించినట్లు చెప్పారు.
గతంలోనే ఆ ఇండ్లలో తాగునీటి కోసం రూ.16 లక్షలు, విద్యుత్తు మరమ్మతుల కోసం రూ.30 లక్షలు మంజూరు కాగా వాటిని సద్వినియోగం చేయడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. పార్టీల ప్రమే యం లేకుండా మంచాల, లింగంపల్లి, నోముల గ్రామాలకు చెందిన నిరుపేదలకు ఇండ్లను కేటాయిస్తే నేడు కాంగ్రెస్ వారు వారిని భయభ్రాంతులకు గురి చేయడం అదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నుంచి లబ్ధిదారులను వెళ్లగొట్టి వేరే వారికి ఇస్తామంటే తరిమికొడతామని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 19 నెలలు దాటినా డబుల్బెడ్రూమ్ ఇండ్లలో వాటర్ గ్రేడ్ ద్వారా సంపులకు నీటి కనెక్షన్ ఎందుకు ఇవ్వలేదని ప్ర శ్నించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో వారం రోజుల్లో సమస్యలు పరిష్కరించాలని ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డికి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఫోన్లో సూచించారు. లబ్ధిదారులను భయభ్రాంతులకు గురిచేయడం తగదన్నారు.
బీఆర్ఎస్ హయాంలో మంజూరైన నిధులతో శంకుస్థాపనలా..?
ఇబ్రహీంపట్నం నియోజకవర్గాభివృద్ధికి బీఆర్ఎస్ హయాంలో తాను రూ. 470 కోట్లను మం జూరు చేయిస్తే.. ఇప్పుడున్న ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆ నిధులతో అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు చేస్తున్నాడు తప్ప.. ప్రభుత్వం నుంచి రూపాయి కూడా అభివృద్ధి కోసం నిధులు తీసుకురాలేదని విమర్శించారు. 19 నెలల పాలనలో నిత్యం మంత్రి పదవి కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతూ నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. ఇబ్రహీంపట్నం క్యాం పు కార్యాలయంలో ఇప్పటివరకూ నియోజకవర్గ అధికారులతో ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదని ఎద్దేవా చేశారు.
పోలీసులు ప్రజల కోసం పనిచేయాలి కానీ వారిని ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. డబుల్బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులు అధైర్యపడొద్దని బీఆర్ఎస్ పార్టీ మీకు ఉండగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి, మాజీ ఎంపీపీ నర్మద, మా జీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, మండల పార్టీ అధ్యక్షుడు చీరాల రమేశ్, ప్రధా న కార్యదర్శి బహదూర్, నాయకులు జంబుల కిషన్‌రెడ్డి, దండేటికార్ రవి, ఎండీ జానీపాషా, బద్రీనాథ్ గుప్తా, గంట విజయ్, పల్నాటి బాల్‌రాజ్, చింతకింది వీరేశం, పరమేశ్, మహేందర్ యాదవ్, సుకన్య, మంకు ఇందిర, ప్రభాకర్, జంగారెడ్డి, బత్తుల కిషన్‌రెడ్డి, రావుల శంకర్, చిందం రఘుపతి, బొట్టు ప్రవీణ్, చిందం జంగయ్య తదితరులు పాల్గొన్నారు.