MLA Sabitha | కందుకూరు, ఫిబ్రవరి 23 : జర్నలిస్టులు నిజాన్ని నిర్భయంగా రాయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం కందుకూరు మండల కేంద్రంలో ఐడీటీవీని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. జర్నలిస్టులు ప్రజల పక్షాన ఉండాలని, ప్రజల గొంతుకై ప్రశ్నించాలని కోరారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండాలని సూచించారు. నిజాన్ని నిర్భయంగా రాయాలన్నారు. మీరు రాసే వార్తల్లో, ప్రసారం చేసే కథనాల్లో వాస్తవం లేనట్లయితే ఎంతటి వారినైనా నిలదీసే తత్వం తనదని తెలిపారు. ఎక్కడో వెనుకబడి ఉన్న తెలంగాణను 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ అభివృద్ధి చేశారని చెప్పారు.
కార్యక్రమంలో ఎండి అంజిబాబు, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మన్నె జయేంద్ర ముదిరాజ్, పిఎసిఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, సీనియర్ నాయకులు గంగాపురం లక్ష్మీ నరసింహ రెడ్డి, మహేందర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు సురసాని రాజశేఖర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, డైరెక్టర్ పొట్టి ఆనంద్, మాజీ డైరెక్టర్ సామ ప్రకాష్ రెడ్డి, ఆనేగగౌని దామోదర్ గౌడ్, యూత్ అధ్యక్షులు తాళ్ల కార్తీక్, సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్ రెడ్డి, సురేష్ ముదిరాజ్, కంద పెద్ద నరసింహ, రవీందర్, కందుకూరు ఇంచార్జ్ రాజేశ్వరి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.