బీఆర్ఎస్ పార్టీ రజతోత్సన మహాసభకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి అధిక సంఖ్యలో తరలివెళ్లి విజయవంతం చేసి.. మరోసారి బీఆర్ఎస్ సత్తాను చాటాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వారు సోమవారం బీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, ముఖ్యనాయకులతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా చలో వరంగల్ రజతోత్సవ సభకు సంబంధించి వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రతి గ్రామం, మండలం, మున్సిపాలిటీల నుంచి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు దండిగా వరంగల్‌కు వెళ్లి సక్సెస్ చేద్దామన్నారు.