కేశంపేట, ఆగస్టు 17 : రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బ్యాగరి అంజయ్య శనివారం మృతి చెందాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు బాధిత కుటుంబానికి అండగా నిలిచి ఆదివారం ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శేఖర్ పంతులు రూ.5వేలు, యువ నాయకుడు ప్రేమ్‌కుమార్‌గౌడ్ రూ.5వేలు తక్షణ సహాయంగా అందజేసి మనోధైర్యం కల్పించారు.
అధైర్యపడవద్దని, మృతుని కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో షేక్ హుస్సేన్, దశరథ్, చాకలి సత్యం, చైతన్య, మాధవ్, సాయి, ఆసిఫ్, కర్నెకోట నరేందర్, ఆంజనేయులు, బుడుగు మల్లేశ్‌యాదవ్, అమర్నాథ్రెడ్డి, రాజు, తదితరులు పాల్గొన్నారు.