బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్ఎస్ నాయకులపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అత్యంత వివాదాస్పద, అన్ పార్లమెంటరీ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆయా పోలీస్స్టేషన్లలో కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.
రాజకీయ ప్రత్యర్థులు, రైతులను ఉద్దేశించి హింసను ప్రేరేపించేలా, ఆత్మహత్యలకు ఉసిగొల్పేలా, సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడిన రేవంత్‌పై బీఎన్ఎస్-2023 సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ధారూరు, జూలై 14: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్ఎస్ నాయకులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన అత్యంత వివాదాస్పద, అన్-పార్లమెంటరీ వ్యాఖ్యలను నిరసిస్తూ సీఎంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ధారూరు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. మంగళవారం ధారూరు మండల కేంద్రంలో నిరసన తెలుపుతూ ధారూరు ఎస్ఐ రాఘవేందర్‌కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నాయకుల రక్తాన్ని పంటల మీద చల్లితే అదే పండుతుంది అంటూ హింసను ప్రేరేపించేలా, రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడిన రేవంత్‌రెడ్డిపై భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్), 2023 కింద తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా నిర్వహించిన ప్రెస్‌మీట్ సందర్భంగా విలేకరుల సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు రైతులకు నీళ్ల సౌకర్యం ఏవిధంగా కల్పిస్తారు అని అడిగితే బీఆర్ఎస్ పార్టీ నాయకులను కోసి రక్తం పంటల మీద చల్లితే సరిపోతుంది అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో ధారూరు బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు రాములు, జైపాల్‌రెడ్డి, సంతోశ్‌కుమార్, రహిమతుల్లాఖాన్, హఫిజ్, చిన్నయ్యగౌడ్, వెంకటయ్య, బీమ్సేన్చారి, మహేశ్‌కుమార్, దేవేందర్‌నాయక్, లక్ష్మయ్య, అంజయ్య, రాజు, రవి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
మర్పల్లి : రాజకీయ ప్రత్యర్థులు, రైతులను ఉద్దేశించి హింసను ప్రేరేపించేలా, ఆత్మహత్యలకు ఉసిగొల్పేలా అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.. మంగళవారం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మర్పల్లి పోలీస్‌స్టేషన్‌లో రేవంత్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ మోహన్‌రెడ్డి, బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు మధుకర్, రైతుబంధు మండల మాజీ అధ్యక్షుడు నాయబ్‌గౌడ్, మాజీ కో-ఆప్షన్ మెంబర్ సోహెల్, టౌన్ ప్రెసిడెంట్ గఫార్, పీఏసీఎస్ డైరెక్టర్ యాదయ్య, మాజీ సర్పంచ్ ఇందిరాఅశోక్, మైనార్టీ మండల అధ్యక్షుడు షఫీ, ఉపాధ్యక్షుడు రమేశ్మిత్ర, నీలి శ్రీకాంత్, వికాస్, వేణుగోపాల్, వెంకట్‌రెడ్డి, పిర్యానాయక్, నర్సింహులు అలీమ్ పాల్గొన్నారు.

కొడంగల్ : సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు హింసను ప్రోత్సహించే విధంగా ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. మంగళవారం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ మధుసూధన్‌రావు యాదవ్, పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో మల్లేశ్, బాల్‌రాజ్, మోహన్, మహ్మద్ఫ్రీ, ఇర్ఫాన్, భాస్కర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
తాండూరు : నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి పంజుగుల శ్రీశైల్‌రెడ్డి పిలుపు మేరకు మంగళవారం బషీరాబాద్ మండలంతో పాటు నియోజవకర్గంలోని పలు మండలాల్లో స్థానిక పోలీసు అధికారులకు బీఆర్ఎస్ నేతలు లిఖిత పూర్వక ఫిర్యాదులు సమర్పించారు. ఈ సందర్భంగా పంజుగుల శ్రీశైల్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో విమర్శలు ఉండవచ్చు.. కానీ, ప్రజలను రెచ్చగొట్టే భాష, వ్యక్తిగత విద్వేషాన్ని ప్రేరేపించే మాటలను తెలంగాణ సమాజం అంగీకరించదన్నారు. ఈ సందర్భంగా బషీరాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు పంజుగుల నర్సిరెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి విభజన రాజకీయాలకు తెరలేపడం సరికాదన్నారు. కార్యక్రమంలో బషీరాబాద్ ఉప సర్పంచ్ అబ్ధుల్జ్రాక్, మండలంలోని సర్పంచ్‌లు నవీన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు నర్సింహులు, తాహేర్, జమ్ము, బాలే సాహెబ్, అంజిలప్ప పాల్గొన్నారు.
షాద్‌నగర్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావులపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యాలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పిలుపు మేరకు షాద్‌నగర్, కేశంపేట, కొందుర్గు, చౌదరిగూడ, నందిగామ మండలాల్లోని పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేసి మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి తన స్థాయి మరిచి అత్యంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. సీఎం వ్యాఖ్యలు తెలంగాణలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించేలా ఉన్నాయని, వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా
కేశంపేట : సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం బీఆర్ఎస్ నాయకులు కేశంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక రాష్ట్రంలోని ప్రశాంత వాతావరణనాన్ని పాడు చేసే కుట్రలకు తెరలేపాడని, ఇందులో భాగంగానే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాడన్నారు. ఫిర్యాదు చేసినవారిలో మాజీ సర్పంచ్ వెంకట్‌రెడ్డి, నాయకులు జమాల్‌ఖాన్, సాజిద్, బద్రునాయక్, శేఖర్‌యాదవ్, మురళీ పాల్గొన్నారు.
ఆమనగల్లు,(మాడ్గుల): అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ మండల మాడ్గుల శ్రేణులు మాడ్గుల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఎస్సై నాగరాజుకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు జైపాల్‌నాయక్, లాలయ్యగౌడ్, కృష్ణారెడ్డి, గోవిందు, శ్రీధర్, యాదిరెడ్డి, తిరుమల్‌రెడ్డి, తిరుపతి, యాదయ్య, రాజుగౌడ్, శ్రీను, యాదయ్య, చెన్నకేశవులు, శ్రీశైలం పాల్గొన్నారు.