Donation | తుర్కయంజాల్, జనవరి 19 : తుర్కయంజాల్ డివిజన్ పరిధిలోని కాశం గుట్ట వద్ద నూతనంగా నిర్మిస్తున్న శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానంలో ఏర్పాటు చేయనున్న ధ్వజ స్తంభం ఏర్పాటు కోసం బీఆర్ఎస్ నాయకులు భారీ మొత్తంలో విరాళం అందించారు.
బీఆర్ఎస్ నేతలు రొక్కం భీం రెడ్డి, రొక్కం శేఖర్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులకు రూ. 4లక్షలు విరాళంగా అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంత లభిస్తుందని అన్నారు. తుర్కయంజాల్ ప్రజలకు ఎల్లప్పుడూ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మేతరి స్వామి, అంజయ్య, మల్లయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Anti Biotics | యాంటీ బయోటిక్స్ వాడితే.. పేగుల ఆరోగ్యాన్ని ఇలా రక్షించుకోండి..!
Mirai | టీవీ ప్రీమియర్‌కు సిద్ధమైన బ్లాక్‌బస్టర్ ‘మిరాయ్’… ఈ నెలలోనే స్టార్ మా లో సందడి
Bhadradri Kothagudem : ‘గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్లు’