బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబురాలు నిర్వహించుకున్నారు. పటాకులు కాల్చి, ఒకరికొకరు స్వీట్లు తినుపించుకున్నారు. పార్టీ శ్రేణులు మండల కేంద్రాలు, పట్టణాల్లో ర్యాలీలు నిర్వహించారు. జై బీఆర్ఎస్, జై కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దేశ్‌కి నేత సీఎం కేసీఆర్, కేసీఆర్‌తోనే దేశాభివృద్ధి సాధ్యమంటూ నినదించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించి రాష్ట్ర పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేసి పేద ప్రజలకు అండగా నిలిచేందుకే సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని పేర్కొన్నారు.
వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ నివాసంలో ఒకరినొకరు మిఠాయిలు తినిపించుకుంటున్న ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, నాయకులు, పాల్గొన్న పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, కోట్‌పల్లి ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, కోట్‌పల్లి మండల అధ్యక్షుడు అనీల్ తదితరులు
పరిగిలో
పరిగి టౌన్, డిసెంబర్ 9 : బీఆర్ఎస్ జాతీయ పార్టీగా గుర్తింపు రావడంతో పరిగిలో శుక్రవారం పార్టీ నాయకులు స్వీట్లు తినిపించుకొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి నివాసం దగ్గర రాష్ట్ర నాయకులు కొప్పుల అనిల్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అశోక్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతిగారి సురేందర్‌కుమార్, ఎంపీపీ అరవింద్రావులతో పాటు పలువురు పార్టీ నాయకులు ఒకరికొకరు స్వీట్లు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. మాడ్గులలో..
మాడ్గుల
జాతీయ పార్టీగా బీఆర్ఎస్కు గుర్తింపు రావడంతో మండలంలో పార్టీ శ్రేణులు పటాకులు కాల్చి సంబురాలు చేశారు. కార్యక్రమంలో యాదయ్యగౌడ్, రాములు, విష్ణు, మహేశ్, లాలయ్య గౌడ్, శేఖర్, ఆంజనేయులు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
దేశ్‌కీ నేత సీఎం కేసీఆర్..
ఆమనగల్లు, డిసెంబర్ 9 : బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆమనగల్లు పట్టణంలోని హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై మున్సిపాలిటీ కన్వీనర్ నేనావత్ పత్యానాయక్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ తోట గిరి యాదవ్, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి హాజరయ్యారు. అనంతరం బాణాసంచా కాల్చి, సంబురాలు జరుపుకొన్నారు. జై బీఆర్ఎస్, కేసీఆర్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అర్జున్‌రావు, ఎంపీటీసీ కుమార్, ఏఎంసీ డైరెక్టర్ సుభాష్, సీనియర్ నాయకులు నిరంజన్, తల్లోజు రామకృష్ణ, సయ్యద్ ఖలీల్, నాయకులు గుత్తి బాలస్వామి, జంతుక అల్లాజీ, సాయిలు, యూత్ నాయకులు నరేందర్, కిరణ్, రమేశ్, ప్రసాద్, వడ్డే వెంకటేశ్, ఎనుమల్ల రమేశ్, భాస్కర్, శివ, మల్లేశ్ నాయక్, జంతుక పర్వతాలు, లండం యాదయ్య, మద్దూరి ఆనంద్, జంతుక కృష్ణ, హనీఫ్, అప్సర్, గుత్తి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
దేశాభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యం
కడ్తాల్, డిసెంబర్ 9 : సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీతోనే దేశాభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కంబాల పరమేశ్ అన్నారు. బీఆర్ఎస్కు భారత సంఘం ఆమోదం తెలిపిన సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలో సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి, మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పరమేశ్ మాట్లాడుతూ రాష్ట్ర పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు లక్ష్మాణాచారి, శ్రీకాంత్, నాయకులు కృష్ణ, వెంకటేశ్, రామకృష్ణ, సురేశ్, శ్రీనివాస్, మహేశ్, శివ, వేణు, రమేశ్, రాజు, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.