Junior College | బొంరాస్పేట, మే 31 : మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆఫీసు కోసం కేటాయించిన గది ముందు బీరు బాటిల్స్ ప్రత్యక్షమయ్యాయి. ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తులు బీరు బాటిల్స్, సిగరెట్ ప్యాకెట్స్, ఇతర చెత్త పదార్థాలు వేశారు. దీనిపై గ్రామ పెద్దలు, పోలీసు అధికారులు చొరవ తీసుకుని పెట్రోలింగ్ ఏర్పాటు చేసి ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. కళాశాలలు, పాఠశాలలు అంటే దేవాలయాలతో సమానమని ఇలాంటి చర్యలు చేయడం మంచి పద్ధతి కాదని గ్రామ ప్రజలు మండిపడ్డారు.