Guest Faculty | తాండూరు రూరల్, జూలై 10 : ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ మహాత్మాజ్యోతి భాపూలే బీసీ గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అతిథి ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తాండూరు (బషీరాబాద్) మహాత్మాజ్యోతి భా పూలే బీసీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శివగీత గురుకువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, సాంఘీక శాస్త్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఫోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పీజీ, బీఈడీ చేసిన వారు అర్హులన్నారు. ఈ నెల 11-7-2025 వ తేదీ నుంచి 14-11-2025 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. అభ్యర్థులు మహాత్మాజ్యోతి బా పూలే బీసీ (బాలికల) గురుకుల పాఠశాల, ఎంఆర్ఆర్ కాంప్లెక్స్, సహారాగేట్ నెం.1,రోడ్డు నెం.6 మన్సూరాబాద్, రంగారెడ్డి జిల్లాలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు.