ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 27 : బీఆర్ఎస్ పార్టీ వైపే నేడు దేశ ప్రజలంతా చూస్తున్నారని, బీఆర్ఎస్తోనే దేశ అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మంచాల మండల పరిధిలోని బండాలేమూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, సీపీఎంపార్టీలకు చెందిన సుమారు 40మంది నాయకులు, కార్యకర్తలు మంగళవారం బీఆర్ఎస్ మంచాల మండల అధ్యక్షుడు చీరాల రమేశ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సమక్షంలో ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పేదల, దళితుల, రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్లో చేరినవారిలో కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు లొంగారి జంగయ్య, కాంగ్రెస్ వార్డుసభ్యులు రమేశ్‌తో 40మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, ఎంపీపీ నర్మద, బీఆర్ఎస్ మంచాల మండల అధ్యక్షుడు చీరాల రమేశ్, ప్రధాన కార్యదర్శి బహదూర్, ఎంపీటీసీ సుకన్య, సహకార సంఘం చైర్మన్ బి.పుల్లారెడ్డి, నాయకులు చంద్రయ్య, డి.రవి, రఘుపతి, రవి, బుగ్గరాములు, కిషన్‌రెడ్డి, పి.రాము, కరుణాకర్, విజయ్, జంగారెడ్డి, శేఖ ర్, బద్రినాథ్, మల్లేష్, పి.రాజు, కిషన్‌రెడ్డి, రాజు, లింగం, కిషన్, మోతీలాల్, గురువయ్య, ప్రకాశ్‌రెడ్డి, జంగారెడ్డి, శ్రీశైలం, యాదయ్య, కె. విజయ్‌కుమార్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తుర్కయాంజాల్ : మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలో 25 లక్షల లీటర్ల నీటి సామర్థ్యంతో నిర్మించనున్న ఓవర్ హెడ్ ట్యాంక్ సర్వీస్ రిజర్వాయర్ పనులను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు తాగునీరు సమస్య తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో రూ.92 కోట్లతో మిషన్ భగీరథ పనులను చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఓవర్ హెడ్ ట్యాంకు పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు మంచీనిరు అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన కమ్మగూడలోని రాజ్‌రంజిత్ ప్రైమ్ హోమ్స్ కాలనీలో భగీరథ పనుల్లో భాగంగా చేపడుతున్న తాగునీటి పైపులైన్ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మున్సిపాలిటీ చైర్ పర్సన్ మల్రెడ్డి అనురాధ, వైస్ చైర్పర్సన్ హరిత, కౌన్సిలర్లు ఐలయ్య, స్వాతి, కీర్తన, భాగ్యమ్మ, మంగమ్మ, ఉదయశ్రీ, మాజీ సర్పంచ్ కందాడి లక్ష్మారెడ్డి, చెవుల దశరథ, బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి, మహి ళా అధ్యక్షురాలు అశ్విని, బీఆర్ఎస్ నాయకులు యాదిరెడ్డి, నిరంజన్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, బాబయ్య, దయానంద్, సుధాకర్‌రెడ్డి, విజయానంద్‌రెడ్డి, శంకర్ పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఉన్నత ఆశయంతో ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని తులేకలాన్ గ్రామానికి చెందిన బోడ లక్ష్మీరాజుకు దళితబంధు కింద మంజూరైన ట్రాక్టర్‌ను మంగళవారం ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయం ఆవరణలో అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సమితి చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, ఎంపీపీ కృపేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు, సర్పంచ్ యాదగిరి, ఎంపీటీసీ నాగమణి, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు రాజు, నాయకులు పున్నం రాము, మహేందర్, ఆంజనేయులు, రాజు, జగన్ పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 27 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం ద్వారా అన్నదాతల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. 9వ విడుత రైతుబంధు పథకం డబ్బులు నేటినుంచి రైతుల ఖాతాల్లో జమకానున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ యాసంగి పంట పెట్టుబడి కోసం నియోజకవర్గానికి చెందిన 55217మంది రైతులకు రూ.61.52కోట్ల నిధులను కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు న్యా యబద్ధంగా రావాల్సిన నిధులను నిలిపివేసి, తెలంగాణాకు తీవ్ర అన్యాయం చేస్తున్నప్పటికీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. యాసంగిలో ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన 16925మంది రైతులకు 17.48కోట్లు, అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో 9468మందికి రూ.8.19 కోట్లు, మంచాల మండలంలో 14865 మందికి రూ.16.17 కోట్లు, యాచారం మండలంలో 14589 మందికి రూ.19.68కోట్లు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బుగ్గరాములు, చీరాల రమేశ్, కర్నాటి రమేశ్‌గౌడ్, కిషన్‌గౌడ్, ఎంపీపీలు నర్మద, కృపేశ్, జడ్పీటీసీ జంగమ్మ పాల్గొన్నారు.