Chevella | చేవెళ్ల టౌన్, జూన్ 20 : నకిలీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చేవెళ్ల వ్యవసాయ అధికారి శంకర్ లాల్ ఫర్టిలైజర్ షాపు యజమానులను హెచ్చరించారు. శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసి రిజిస్టర్లను వ్యవసాయ అధికారులు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యతలేని విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుకాణాల్లో ఎప్పటికప్పుడు స్టాక్ నిలువల వివరాలను బోర్డులపై పెట్టాలని తెలిపారు. రైతులు విత్తనాలు ఎరువులు కొనుగోలు సమయంలో తప్పనిసరిగా వారికీ రసీదులను ఇవ్వాలని చెప్పారు.