ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పండుగలా బీఆర్ఎస్లో చేరికల జోరు కొనసాగుతున్నది. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల సమక్షంలో అధిక సంఖ్యలో కాంగ్రెస్, బీజేపీ నేతలు గులాబీ కండువా కప్పుకొని పార్టీలో చేరుతున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. నియోజకవర్గాల్లో మరింత అభివృద్ధిని సాధించాలంటే బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలు అమలుకు సాధ్యంకాని హామీలను ఇస్తూ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు.