Girl kidnap Case | రంగారెడ్డి జిల్లా కోర్టులు, జులై 10 (నమస్తే తెలంగాణ) : పాఠశాల నుండి ఇంటికి వెలుతున్న మైనర్ బాలిక(4)ను తాగిన మైకంలో కిడ్నాప్ చేసిన నిందితుడు దేవర నర్సింహ(36)కు అయిదు సంవత్సరాల జైలుశిక్షతోపాటు రూ.7 వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా పోక్సో ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. బాధితురాలికి లక్ష రూపాయల పరిహారం అందించాలని న్యాయసేవా సంస్థను ఆదేశిస్తూ తీర్పునిచ్చింది.
అదనపు పీపీ రఘు కథనం ప్రకారం.. పహాడిషరీఫ్ పరిధిలోని సర్దార్నగర్లో బాలిక కుటుంబం నివాసం ఉంటుండగా.. బాలిక స్థానిక పాఠశాలలో చదువుకుంటుంది. అయితే 2020 ఫిబ్రవరి 29న స్కూల్ నుండి ఇంటికి వెళ్లడానికి బస్సు కోసం వేచి యున్న బాలిక దగ్గరకు అదే ప్రాంతానికి చెందిన నిందితుడు వెళ్లి బలవంతగా కిడ్నాప్ చేసి తీసుకువెళ్లాడు.
గమనించిన స్థానికులు విషయం బాలిక తల్లికి తెలపగా వెంటనే నిందితుడి దగ్గరకు వెళ్లి బాలికను నిందితుడి చెర నుండి విడిపించి జరిగిన విషయంపై పహాడిషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నర్సింహను రిమాండ్కు తరలించి దర్యాప్తు నిర్వహించి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. సాక్షాధారాలను పరిశీలించిన న్యాయస్థానం శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
Peddapalli | అంతర్గాంలో అటవీశాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవం
Dasari Manohar Reddy | మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
Huzurabad | పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి.. 11 మంది అరెస్ట్