అభివృద్ధిని చూసే టీఆర్ఎస్లోకి..

కొత్తూరు: టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి, వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఆకర్శితులవుతున్నారని ఎమ్మె ల్యే అంజయ్య యాదవ్ అన్నారు. ఆదివారం కొత్తూరు, నందిగామ మండలాలకు చెందిన పలు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభు త్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. అందరి సమన్వయంలో ఉమ్మడి కొత్తూరు మండలాన్ని అభివృద్ధిలో ముందుంచుతామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ వందకు పైగా డివిజన్లలో విజయఢంకా మోగిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. తమ ప్రచారంలో భాగంగా ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూస్తుంటే స్పష్టమవుతున్నదన్నారు.
కొత్తూరు మండలంలో..
తిమ్మాపూర్ మాజీ సర్పంచ్ కొస్గి శ్రీనివాస్ తన అనుచరులతో టీర్ఎస్లో చేరారు. మాజీ వార్డు సభ్యులు యాదయ్య, ప్రమోద్‌గౌడ్, భాస్కర్ గౌడ్, రవిగౌడ్, గోపిలకు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి మధు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కొత్తూరు మున్సిపాలిటీకి త్వరలో జరుగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందన్నారు.
నందిగామ మండలంలో...
మండలంలోని చేగూర్ సర్పంచ్ మామిళ్ల సంతోశ్ విఠల్ ముదిరాజ్, బుగ్గోని గూడ సర్పంచ్ బండి నీలమ్మ రాజు, చేగూర్ సింగిల్ విండో మాజీ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు విఠల్‌లకు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, కొత్తూరు ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, కొత్తూరు జడ్పీటీసీ శ్రీలత, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ కృష్ణ యాదవ్, మాజీ సర్పంచ్‌లు జనార్దన్‌రెడ్డి, జనిగె జగన్, కాట్ప రాజు, టీఆర్ఎస్ కొత్తూరు అధ్యక్షుడు యాదగిరి, నాయకులు సత్తయ్య, సాయిలు, సంతోశ్‌నాయక్, తులసి బాలయ్య, శ్రీనునాయక్, అరుణ రమేశ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- ‘డ్రాగన్ ఫ్రూట్’ పేరు మారుతోంది..
- గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నేడే చివరి తేదీ
- బైడెన్ ప్రమాణం.. ఎంత మంది హాజరవుతున్నారో తెలుసా ?
- తెలంగాణలో కొత్తగా 267 పాజిటివ్ కేసులు
- వావ్ టీమిండియా.. ఆకాశానికెత్తిన ఆస్ట్రేలియన్ మీడియా
- పూజలు చేస్తున్న 'కాకి'.. ప్రాణంగా చూసుకుంటున్న 'మీనా'
- జల్పాయ్గురి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
- బిలియనీర్ జాక్‌మా కనిపించారు..
- కప్పేసిన పొగమంచు.. పలు రైళ్లు ఆలస్యం
- యూపీలో 12 ఏండ్ల బాలికపై లైంగికదాడి, హత్య