రంగారెడ్డి, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని సరూర్నగర్, శంషాబాద్ డివిజన్ల పరిధిలోని 249 వైన్స్ షాపులకు శనివారంతో టెండర్లు ముగిశాయి. కాగా, వాటికి సుమారు 13,300 పైగా దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. వచ్చిన అప్లికేషన్ల నుంచి ఈ నెల 23న లక్కీడిప్ ద్వారా దుకాణాలను కేటాయించనున్నారు.
సరూర్నగర్ డివిజన్ పరిధిలోని 138 వైన్స్ షాపులకు 7,000 దరఖాస్తులు, శంషాబాద్ డివిజన్ పరిధిలోని 111 షాపులకు 6,300లకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దరఖాస్తులు గణనీయంగా తగ్గాయి. గతేడాది జిల్లాలో 21,665 దరఖాస్తులు రాగా రూ. 4,32 కోట్ల ఆదాయం సమకూరింది.