మొయినాబాద్, ఏప్రిల్ 21: 111 జీవో ఆంక్షలతో 84 గ్రామాల ప్రజలు 25 ఏండ్లుగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ జీవోతో శిథిలావస్థకు చేరిన ఇంటిని కూడా తిరిగి నిర్మించుకోలేని పరిస్థితి.. ఇతర అభివృద్ధి పనులను చేపట్టేందుకు కూడా అవకాశంలేదు. దీంతో ఇక్కడి ప్రాంత ప్రజలు 111 జీవోను ఎత్తివేయాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేయగా స్పందించిన ఆయన తమ చిరకాల కోరికను నెరవేర్చారని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు అనంతరెడ్డి అన్నారు. 111 జీవోను ఎత్తివేస్తూ జీవో 69ను జారీ చేయడాన్ని హర్షిస్తూ గురువారం టీఆర్ఎస్ శ్రేణులు, స్థానికులు మండలంలో పటాకులు కాల్చి సంబురా లు జరుపుకొన్నారు. హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై సంబురాల ర్యాలీని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటి పరిస్థితులకు అనుగుణంగా నగరానికి తాగునీరు అం దించే జంట జలాశయాల పరిరక్షణ కోసం 111 జీవోను తీసుకురావడంతో 84 గ్రామాల ప్రజలకు గుదిబండగా మారిందన్నారు. గత 25 ఏండ్లుగా ఈ గ్రామాల ప్రజలు జీవో ఆంక్షలతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, జీవోను ఎత్తివేయాలని గతంలోని ఉమ్మడి ప్రభుత్వాల పాలకులకు పలుసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదన్నా రు.
తెలంగాణ ఏర్పడి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులను తెలుసుకుని… జీవోను ఎత్తివేస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారని.. ఆ హామీ మేరకు బుధవారం 111 జీవోను ఎత్తివేస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు కొనియాడారు. సీఎంకు 84 గ్రామాల ప్రజలు రుణపడి ఉంటారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు నరోత్తంరెడ్డి, టీఆర్ఎస్ మహి ళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్వప్న, మాజీ జడ్పీటీసీ చంద్రలింగంగౌడ్, సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, కృష్ణారెడ్డి, గణేశ్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు జయవంత్, రావూ ఫ్, సుధాకర్‌యాదవ్, బాల్‌రాజ్, ప్రధాన కార్యదర్శి నర్సింహాగౌడ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ డప్పు రాజు, డైరెక్టర్ ఆంజనేయులుగౌడ్, సర్పంచ్‌లు శ్రీనివాస్, మనోజ్‌కుమార్, రాజు, రత్నం, ఎంపీటీసీ రితీశ్‌రెడ్డి, టీఆర్ఎస్ యువత అధ్యక్షుడు పరమేశ్, నాయకులు సురేందర్‌గౌడ్, రవీందర్, జైపాల్‌రెడ్డి, అంజిరెడ్డి, నర్సింహ, రవియాదవ్, వెంకట్‌రెడ్డి, కరణ్, సునీల్‌కుమార్, కిరణ్, భరత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్, ఏప్రిల్ 21: సీఎం కేసీఆర్ 111 జీవో ఆంక్షలను ఎత్తివేస్తూ జీవో 69ని జారీ చేయడంతో మండలంలోని ప్రజలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చేవెళ్లలోని బీజాపూర్ రహదారి, పోలీసుస్టేషన్ ఎదుట గురువారం టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో పటాకులు కాల్చి స్వీట్లు పంచిపెట్టి సంబురాలు నిర్వహించారు. 84 గ్రామాల ప్రజలకు గుడిబండగా మారిన 111 జీవోను సీఎం కేసీఆర్ ఎత్తివేయడంతో ఆ గ్రామాల్లోని భూములు అధిక మొత్తంలో అందుబాటులోకి వచ్చి మరింత అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఇచ్చిన మాటను నెరవేర్చిన సీఎం కేసీఆర్‌కు ఈ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు శివారెడ్డి, సర్పంచ్‌లు శ్రీనివాస్, మల్లారెడ్డి, మార్కె ట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మాణిక్యరెడ్డి, టీఆర్ఎస్ యూత్ విభాగం మండల అధ్యక్షుడు తోట శేఖర్, ముడిమ్యాల పీఏసీఎస్ వైస్ చైర్మన్ మల్లేశ్, సివిల్ సైప్లె జిల్లా సభ్యుడు రవి, మార్కె ట్ కమిటీ డైరెక్టర్ యాదగిరి, ఉప సర్పంచ్ విజయ్, నాయకులు కృష్ణారెడ్డి, నరేందర్ గౌడ్, శ్రీను, చింటు, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.