e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home రంగారెడ్డి టీఆర్‌ఎస్‌లోకి వలసలు పెరిగాయి

టీఆర్‌ఎస్‌లోకి వలసలు పెరిగాయి

వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌
స్వచ్ఛందంగా పార్టీలో చేరికలు

ధారూరు, జూలై 31: ప్రభుత్వ పాలన మెచ్చి స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్‌లోకి వలసలు పెరుగుతున్నాయని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ అన్నారు. శనివారం ధారూరు మండల పరిధిలోని నాగసముందర్‌ గ్రామంలో సర్పంచ్‌ చంద్రకళ, ఉపసర్పంచ్‌ రాజు, వార్డు సభ్యులు చంద్రప్ప, రియానాబేగం, వీరేశం, లక్ష్మి, అంజిలమ్మ, రమేష్‌, మొగులప్ప, భారతి కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకులను టీఆర్‌ఎస్‌ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు నాగసముందర్‌ గ్రామ నాయకులు వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ను ఘన స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాలన మెచ్చి స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్‌ పార్టీలోకి ముఖ్య నేతలు చేరుతున్నారన్నారు. గతంలో ఏనాడు జరుగని అభివృద్ధి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ధారూరు వైస్‌ ఎంపీపీ విజయ్‌కుమార్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ రాజుగుప్తా, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ రాజునాయక్‌, టీఆర్‌ఎస్‌ ధారూరు మండల అధ్యక్షుడు కె.వేణుగోపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి యూసుస్‌, ఎంపీటీసీలు జగదేవి, శ్రీనివాస్‌, ధారూరు మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు వీరేశం, నాయకులు విజయ్‌కుమార్‌, అంజయ్య, సంతోష్‌కుమార్‌, అనంతయ్య, లక్ష్మయ్య, వీరేషం, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆహ్లాదంతో ఆరోగ్యం : ఎమ్మెల్యే
వికారాబాద్‌, జూలై 31 : పార్కులను కాలనీ ప్రజలు సద్వినియోగం చేసుకుంటే ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ పేర్కొన్నారు. శనివారం మున్సిపల్‌ పరిధిలోని 28వ వార్డు చౌదరి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన పిల్లల పార్కును మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో పార్కుల ఏర్పాటుపై ప్రత్యేకమైన దృష్టి పెట్టిందన్నారు. చిన్నారులు ఆడుకోవడానికి వివిధ రకాల ఆట వస్తువులతో పార్కును ఏర్పాటు చేశారన్నారు. పిల్లల ఆరోగ్యం, ఎదుగుదలకు క్రీడలు ఎంతో తోడ్పడుతాయని తెలిపారు. కార్యక్రమంలో వికారాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిగుళ్లపల్లి మంజులరమేశ్‌కుమార్‌, కౌన్సిలర్‌ మోముళ్ల స్వాతిరాజ్‌కుమార్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ ముత్యంరెడ్డి, వైస్‌ చైర్మన్‌ పాండు, కౌన్సిలర్లు అనంత్‌రెడ్డి, గాయత్రీలక్ష్మణ్‌, నాయకులు రాజ్‌కుమార్‌, సుభాన్‌రెడ్డి, నర్సింహులు, రాజలింగం పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana