వికారాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): తాండూరులోని ఎస్టీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురైన విద్యార్థినులను పరామర్శించేందుకు వెళ్తున్న మా జీ మంత్రులు పి. సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, బీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులను గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మర్రి చెన్నారెడ్డి విగ్రహం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. తాండూరు వెళ్లకుండా సుమారు గంటపాటు రోడ్డుపైనే అడ్డుకోవడంతో.. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి భారీగా చేరుకుని పోలీసుల తీరుకు నిరసనగా నినాదాలు చేయడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. అస్వస్థతకు గురైన విద్యార్థినులను పరామర్శించి, వారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి వస్తామని కలెక్టర్, ఎస్పీతో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఫోన్ చేసి మాట్లాడినా వారు అనుమతివ్వకపోవడంతో మాజీ మంత్రులతోపాటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీశైల్‌రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపైనే బైఠాయించి ధ ర్నా చేపట్టారు.
విద్యార్థినులను పరామర్శించేందుకు వెళ్తామం టే ప్రొటోకాల్ వర్తించదని కలెక్టర్ చెబుతున్నారని.. ప్రొటోకాల్ అంటే తాను ఎమ్మెల్యే, సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీ, మాజీ మం త్రులం ఇంకేం ప్రొటోకాల్ కావాలని సబితారెడ్డి ప్రశ్నించారు. నిన్నగాక మొన్న ఎమ్మెల్యే తమ్ముడు వెళ్లి స్టూడెంట్స్‌ను చూసి వస్తారు. వారికి ప్రొటోకాల్ ఉంటుంది, మాకు ఎందుకు ఉండ దు?.. తాండూరులో పుట్టిన వారికే ప్రొటోకాల్ వర్తిస్తుందంటే తానూ తాండూరులోనే పుట్టానని.. అధికార పార్టీకి చెందిన కార్పొరేషన్ చైర్మన్ చూసి రావొచ్చు కానీ, మేము వెళ్లొద్దంటే.. ఇదెక్కడి న్యాయమని సబితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుమారైలను చూసేందుకు తల్లిదండ్రులనూ అనుమతించకపో వడం తగదన్నారు.
ప్రతిపక్షంలో ఉన్న వారికి ఒక నిబంధన, అధికార పక్షంలో ఉన్న వారికి మరో నిబంధన ఉంటుందా..? అని మాజీ మంత్రులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతరం బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు సబితారెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీశైల్రెడ్డిలను చన్గోముల్ ఠాణాకు.. మెతుకు ఆనంద్‌ను నవాబుపేట పీఎస్‌కు, శుభప్రద్పటేల్ను పరిగి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా తాండూరులో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. మరోవైపు ఫుడ్ పాయిజన్ ఘటనపై న్యాయమూర్తి శివలీల నేరుగా హాస్టల్‌కెళ్లి ఆరా తీశారు. అదేవిధంగా ఫుడ్ పాయిజన్ ఘటనలో హాస్టల్ వార్డెన్ విశ్వకుమారితోపాటు ముగ్గురు సిబ్బందిని కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పూడూరు : మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్లను పోలీసులు చన్గోముల్ ఠాణాకు తరలించారు. అక్క డ ఉన్న విలేకరులు ఫొటోలు తీసేందుకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మాజీ మంత్రి సబితారెడ్డి జోక్యం చేసుకొని విలేకరులనూ అరెస్ట్ చేసేలా పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులు, ఇతరులను బయటికి పంపించి ఠాణా మెయి న్ గేట్‌ను మూసేశారు. డీఎస్పీ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఎంపీపీ మల్లేశం, అదిల్, జావిద్ తదితరులు ఠాణా వద్దకు చేరుకొని మాజీ మంత్రులను కలిసేందుకు వెళ్తామన్నా పోలీసులు అనుమతించలేదు. రెండు గంటలపాటు స్టేషన్లో ఉంచి వారిని తిరిగి హైదరాబాద్‌కు పంపించారు.
వికారాబాద్ : అరెస్టులకు భయపడేది లేదని.. ప్రజా సమస్యలపై తమ పోరా టం ఆగదని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ స్పష్టం చేశారు. తాం డూరు గిరిజన బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురైన విద్యార్థినులను పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రులు, బీఆర్ఎస్ శ్రేణులు, మాజీ ఎమ్మెల్యే ఆనంద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యేను నవాబుపేట ఠాణాకు తరలించగా.. అక్కడ ఆయన మాట్లాడారు. విద్యార్థుల ప్రా ణాలు పోతుంటే ఈ ప్రభుత్వానికి పట్ట డం లేదన్నారు.
బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల నిర్బంధం, అరెస్టులపై ఉన్న ధ్యాస ప్రజా సమస్యలపై లేదన్నారు. ఇందిర మ్మ రాజ్యమంటే విద్యార్థులకు కల్తీ ఆహా రం, అడిగితే అక్రమ అరెస్టులేనా..? అని నిలదీశారు. ఆరు గ్యారెంటీల సం గతి దేవుడెరుగు కనీసం విద్యార్థులకు మంచి ఆహారాన్ని అందించడం ఈ సర్కారుకు చేతకావడం లేదన్నారు. సర్కారు నిర్లక్ష్యం, దాష్టీకానికి పిల్లలు బలవుతున్నారన్నారు.
పరిగి : తెలంగాణలో పోలీసు రాజ్యం నడుస్తున్నదని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ ఆరోపించారు. తాండూరు గిరిజన బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురైన విద్యార్థినులను పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రు లు, బీఆర్ఎస్ శ్రేణులు, శుభప్రద్ పటేల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పరిగి ఠాణాకు తరలించిన శుభప్రద్ పటేల్‌ను పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురేందర్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ఆంజనేయులు, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రవికుమార్ కలిసి సం ఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా శుభప్రద్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ.. అస్వస్థతకు గురైన విద్యార్థినులను పరామర్శించేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డగించి, అరెస్టు చేయ డం సరైంది కాదన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలను కాంగ్రెస్ సర్కారు తుంగలో తొక్కిందని.. హాస్టల్ విద్యార్థులకు మూడు పూటలా మంచి భోజనం పెట్టలేని దుస్థితి లో రేవంత్ సర్కార్ ఉన్నదని మండిపడ్డా రు. రాష్ట్రంలో 48 మంది విద్యార్థులు చనిపోయినా ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తు న్నదన్నారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ కాలేదని, ఎక్కడా ఒక్క సంక్షేమ పథకమూ అమలు జరగడం లేదని విమర్శించా రు. లగచర్లలో ఫార్మా కంపెనీలకు భూము లు ఇవ్వబోమని చెప్పిన రైతులను జైలులో పెడితే ఒక రైతుకు గుండెపోటు వచ్చిందని అన్నారు. ప్రశ్నించే వారందరినీ పోలీసులతో అణచివేసే ధోరణి ని రేవంత్‌రెడ్డి సర్కారు అవలంబిస్తున్నదన్నారు. పోలీసులు చట్టానికి, రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాలన్నారు.