గురువారం 03 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Nov 10, 2020 , 02:31:08

రగుడు జంక్షన్‌ను సుందరీకరించాలి

రగుడు జంక్షన్‌ను సుందరీకరించాలి

  •  కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ 
  • అభివృద్ధి పనుల పరిశీలన

సిరిసిల్ల టౌన్‌: మున్సిపల్‌ పరిధిలోని రగుడు బైపాస్‌ జంక్షన్‌ను సుందరీకరించాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అధికారులను ఆదేశించారు. జంక్షన్‌ వద్ద చేపట్టాల్సిన అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించి, మాట్లాడారు. సిరిసిల్ల పట్టణం మాదిరిగానే ఇక్కడి జంక్షన్‌ను సుందరీకరించాలన్నారు. ప్రయాణికులు, కలెక్టరేట్‌కు వచ్చే ఉద్యోగులు, ప్రజలకు ఇబ్బందుల్లేకుండా డివైడర్లు ఏర్పాటు చేయాలన్నారు. బైపాస్‌ జంక్షన్‌ వద్ద ల్యాండ్‌ స్కేప్‌ పార్కు, ఫుట్‌పాత్‌ను సర్కిల్‌ ఆకారంలో నిర్మించాలన్నారు. ఎస్సార్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద నుంచి కలెక్టరేట్‌ రోడ్డును ఆనుకుని 33ఫీట్ల నిర్మాణం చేపడితే వాహనాల రాకపోకలకు సులభతరంగా ఉంటుందన్నా రు. మున్సిపల్‌ వాహనాల్లో చెత్తను డంప్‌యార్డుకు తరలించేందుకు వీలుంటుందన్నారు. అధికారులు తగిన సాధ్యాసాధ్యాలను పరిశీలించి వీలైనంత త్వరగా నివేదిక రూపొందించి అందజేయాలని కమిషనర్‌కు సూచించారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, కమిషనర్‌ సమ్మయ్య, ఈఈ వెంకటశేషయ్య, టీపీవో అన్సారీ తదితరులు ఉన్నారు.