విషాదం.. తూర్పుగోదావరిలో లారీ బీభత్సం.. ఇద్దరు పోలీసులు మృతి
విషాదం.. తూర్పుగోదావరిలో లారీ బీభత్సం.. ఇద్దరు పోలీసులు మృతి | తూర్పుగోదావరి జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సామర్లకోట మండలం ఉండూరు వద్ద లారీ బీభత్సం సృష్టించింది.

అమరావతి : తూర్పుగోదావరి జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సామర్లకోట మండలం ఉండూరు వద్ద లారీ బీభత్సం సృష్టించింది. గురువారం అర్ధరాతి 2 గంటల సమయంలో ఇద్దరు పెట్రోలింగ్ పోలీసులపైకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మృతులను హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, హోంగార్డు ఎన్ఎస్రెడ్డిగా గుర్తించారు. వీరిద్దరూ విజయవాడ నుంచి వస్తున్న కరోనా వ్యాక్సిన్ వాహనానికి ఎస్కార్ట్‌గా వెళ్లారు. ఈ క్రమంలో ఉండూరు వంతెన వద్ద వాహనం కోసం నిరీక్షిస్తున్న క్రమంలో లారీ వచ్చి ఢీకొట్టింది. మృతులు కాకినాడ తిమ్మాపురం పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్యూటీ కోసం వెళ్లి ఇద్దరిని లారీ రూపంలో మృత్యువు కబళించడంతో విషాదం నెలకొంది.
ఇవి కూడా చదవండి..
14.05.2021, శుక్రవారం.. మీ రాశిఫలాలు
తప్పనిసరి మాస్క్ నిబంధన ఎత్తివేసిన అమెరికా..
మళ్లీ పంజా విసరగలదు
వాయుమార్గంలో వ్యాక్సిన్!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

