e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home టాప్ స్టోరీస్ వాయుమార్గంలో వ్యాక్సిన్‌!

వాయుమార్గంలో వ్యాక్సిన్‌!

వాయుమార్గంలో వ్యాక్సిన్‌!
  • తెలంగాణలో మెడిసిన్‌ ఫ్రమ్‌ది స్కై ప్రాజెక్ట్‌
  • అన్‌మ్యాన్డ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టమ్‌ సేవల్లో బ్లూడార్ట్‌
  • ఈ తరహా ప్రాజెక్ట్‌ చేపట్టిన ఏకైక రాష్ట్రంగా ఘనత

హైదరాబాద్‌, మే 13 (నమస్తే తెలంగాణ): సాంకేతికతను అందిపుచ్చుకొనే రాష్ర్టాల్లో ముందుండే తెలంగాణ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నది. హెల్త్‌నెట్‌ గ్లోబల్‌తో కలిసి తెలంగాణ ప్రభు త్వం ‘మెడిసిన్‌ ఫ్రమ్‌ ది స్కై’ ప్రాజెక్టును విజయవంతంగా పట్టాలెక్కించే దిశగా అడుగువేసింది. టీకాలు, అత్యవసర ఔషధాలను అదించేందుకు అన్‌మ్యాన్డ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టమ్‌ (యూఏఎస్‌)ను ప్రారంభించేందుకు దేశంలోనే అగ్రగామి ఎక్స్‌ప్రెస్‌ లాజిస్టిక్స్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌, డచి పోస్ట్‌ డీహెచ్‌ఎల్‌ గ్రూప్‌ (డీపీడీహెచ్‌ఎల్‌)లో భాగమైన బ్లూడార్ట్‌ సిద్ధమైంది. మారుమూల ప్రాంతాలకు టీకాలు, అత్యవసర వైద్యసేవలను డ్రోన్లతో అందించే లక్ష్యంలో బ్లూడార్ట్‌ మెడ్‌-ఎక్స్‌ప్రెస్‌ కన్సార్టియంను ఏర్పాటుచేసినట్టు గురువారం వెల్లడించింది. తెలంగాణలో ఆరోగ్యసంరక్షణ చర్యల్లో భాగంగా బ్లూడార్ట్‌ మెడ్‌-ఎక్స్‌ప్రెస్‌ కన్సార్టియం తిరుగులేని డెలివరీ మోడల్‌ను వినియోగించనున్నది. జిల్లా మెడికల్‌ స్టోర్స్‌, బ్లడ్‌ బ్యాంకుల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు , బ్లడ్‌ స్టోరేజ్‌ యూనిట్స్‌.. అలాగే పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల నుంచి సెంట్రల్‌ డయాగ్నస్టిక్‌ లేబొరేటరీలకు డెలివరీ సేవలందించేందుకు ఇది వీలు కల్పించనున్నది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వాయుమార్గంలో వ్యాక్సిన్‌!

ట్రెండింగ్‌

Advertisement