జపాన్‌లో భారీ భూకంపం
జపాన్‌లో భారీ భూకంపం | జపాన్‌లోని హోన్షు తూర్పు తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.0 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.

టోక్యో : జపాన్‌లోని హోన్షు తూర్పు తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.0 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. అయితే సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని, అయితే ఇప్పటి వరకు నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు అందలేదని పేర్కొంది. ఉదయం 5:28 గంటలకు భూకంపం సంభవించిందని తెలిపింది. ప్రసిద్ధ ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రానికి దగ్గరగా భూకంపం సంభవించినప్పటికీ ఇప్పటి వరకు.. ప్రకంపనల ప్రభావంపై నివేదికలు అందలేదని చెప్పింది.
ఈ నెల ప్రారంభంలో జపాన్ ఈశాన్య తీరంలో 6.6 తీవ్రతతో భూకంపం నమోదైందని జపాన్ వాతావరణ సంస్థ (జేఎంఏ) తెలిపింది. భూకంపం కేంద్రం పసిఫిక్ మహాసముద్రంలో 60 కిలోమీటర్ల లోతులో గుర్తించారు. దీంతో టోక్యోతో సహా దేశంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయని చెప్పింది. ‘రింగ్ ఆఫ్ ఫైర్’ పేరిట పిలిచే భూకంప జోన్లో జపాన్ ఉందని, దీంతో భారీ భూకంపాలు సంభవిస్తాయని అధికారులు పేర్కొన్నారు. 2011లో 9.0 తీవ్రతతో సంభవించిన భూకంపానికి సునామీ రాగా.. 15వేల మందికి పైగా మృతి చెందారు. అలాగే ఫుకుషిమా అణు కర్మాగార విపత్తుకూ కారణమైంది.
ఇవి కూడా చదవండి..
14.05.2021, శుక్రవారం.. మీ రాశిఫలాలు
తప్పనిసరి మాస్క్ నిబంధన ఎత్తివేసిన అమెరికా..
విషాదం.. తూర్పుగోదావరిలో లారీ బీభత్సం.. ఇద్దరు పోలీసులు మృతి
జైళ్లపై కరోనా పంజా.. 120 మంది ఖైదీలకు పాజిటివ్.. ఇద్దరు మృతి
మళ్లీ పంజా విసరగలదు
వాయుమార్గంలో వ్యాక్సిన్!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

