గురువారం 26 నవంబర్ 2020
Rajanna-siricilla - Sep 29, 2020 , 02:10:47

అంబులెన్స్‌ విరాళం

అంబులెన్స్‌ విరాళం

  • n ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌'కు స్పందన
  •  n మంత్రి కేటీఆర్‌కు 20.50 లక్షల  చెక్కు అందజేత
  • n వీరబత్తిని లక్ష్మణ్‌ ఔదార్యం

రాయికల్‌ రూరల్‌: ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌' కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు రాయికల్‌ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త వీరబత్తిని లక్ష్మణ్‌ అత్యాధునిక వసతులతో కూడిన ఏసీ అంబులెన్స్‌ను కొనుగోలు చేసేందుకు ముందు కు వచ్చారు. ప్రగతి భవన్‌లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌తో కలిసి అంబులెన్స్‌ కొనుగోలు చేసేందుకు మంత్రి కేటీఆర్‌కు సోమవారం 20.50 లక్షల చెక్కును అందించారు. అంబులెన్స్‌ను రాయికల్‌ మండలానికి కేటాయించాలని ఆయన కోరారు. లక్ష్మణ్‌ శ్రీకృష్ణ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ఏర్పా టు చేసి వ్యాపారవేత్తగా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఈ సందర్భంగా ఆయనను కేటీఆర్‌ అభినందించారు.