e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, May 17, 2021
Home News Lychee : హైద‌రాబాద్‌లో ఎక్క‌డ చూసినా ఇవే పండ్లు? వీటి స్పెష‌ల్ ఏంటి ?

Lychee : హైద‌రాబాద్‌లో ఎక్క‌డ చూసినా ఇవే పండ్లు? వీటి స్పెష‌ల్ ఏంటి ?

Lychee : హైద‌రాబాద్‌లో ఎక్క‌డ చూసినా ఇవే పండ్లు? వీటి స్పెష‌ల్ ఏంటి ?

కొద్దిరోజులుగా హైద‌రాబాద్‌లో ఎక్కువ‌గా క‌నిపిస్తున్న ఈ పండ్ల‌ను గ‌మ‌నించారా? చూడ్డానికి స్ట్రాబెర్రీలా క‌నిపిస్తున్న ఈ పండ్లు ఇప్పుడు ఎక్క‌డ చూసినా క‌నిపిస్తున్నాయి. అస‌లు ఈ పండు ఏంటి? ఇవి తింటే ఆరోగ్యానికి మంచిదేనా? ఎప్పుడు ప‌డితే అప్పుడు తినొచ్చా వంటి విష‌యాలు ఇప్పుడు చూద్దాం..

Lychee : హైద‌రాబాద్‌లో ఎక్క‌డ చూసినా ఇవే పండ్లు? వీటి స్పెష‌ల్ ఏంటి ?

స్ట్రాబెర్రీలా క‌నిపించే ఈ పండు పేరు లిచీ ఫ్రూట్‌ ( Lychee Fruit ). అరుదైన కాస్ట్లీ ఫ్రూట్స్‌లో ఇది ఒక‌టి. దీని జ‌న్మ‌స్థ‌లం చైనా. కానీ ఇప్పుడు ప్ర‌పంచంలోని అనేక ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. చైనా, థాయిలాండ్‌, ద‌క్షిణాఫ్రికా, అమెరికా దేశాల‌తో పాటు ఉత్త‌ర భార‌త‌దేశంలో ముఖ్యంగా బిహార్‌లో వీటిని ఎక్కువ‌గా పండిస్తున్నారు. స‌మ్మ‌ర్‌లోనే ఈ పండ్లు ఎక్కువ‌గా ల‌భిస్తాయి. ఈ పండ్ల‌ను చెట్టు రెమ్మ‌ల నుంచి వేరు చేసిన‌ప్పుడు సువాస‌న‌తో పాటు తాజాద‌నం త్వ‌ర‌గా కోల్పోతాయి. అందుకే ఈ పండ్ల‌ను రెమ్మ‌ల‌తో పాటు కోసి అమ్ముతుంటారు.

Lychee : హైద‌రాబాద్‌లో ఎక్క‌డ చూసినా ఇవే పండ్లు? వీటి స్పెష‌ల్ ఏంటి ?

ఈ లిచీ ( Lychee ) పండ్ల‌లోని పై పొర‌ను తొల‌గిస్తే.. సుగంధ ప‌రిమ‌ళంతో కూడిన సున్నిత‌మైన జ్యూసీగా ఉండే తెల్ల‌టి ప‌దార్థం ఉంటుంది. ఇది కేవ‌లం రుచి, సువాస‌న మాత్ర‌మే కాదు.. అద్భుత‌మైన పోష‌కాల‌ను క‌లిగి ఉంటుంది. దీన్ని తిన‌డం వ‌ల్ల ఇమ్యూనిటీ పెర‌గ‌డ‌మే కాకుండా ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ మెరుగుప‌డ‌టంలో, ర‌క్త‌క‌ణాల‌ను పెంపొందించుకోవ‌డంలోనూ సహాయ‌ప‌డుతుంది.

Lychee : హైద‌రాబాద్‌లో ఎక్క‌డ చూసినా ఇవే పండ్లు? వీటి స్పెష‌ల్ ఏంటి ?

ఇమ్యూనిటీ

లిచీ పండ్ల‌లో విట‌మిన్ సీ స‌మృద్ధిగా ఉంటుంది. అలాగే మ‌న శ‌రీరానికి ఒక రోజులు అవ‌స‌ర‌మ‌య్యే ఆస్కార్బిక్ ఆమ్లం (ఏబీఏ) ఇందులో పుష్క‌లంగా ల‌భిస్తుంది. కాబ‌ట్టి శ‌రీరంలో తెల్ల ర‌క్త‌క‌ణాల సామ‌ర్థ్యం పెర‌గ‌డంతో పాటు వ్యాధినిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

Lychee : హైద‌రాబాద్‌లో ఎక్క‌డ చూసినా ఇవే పండ్లు? వీటి స్పెష‌ల్ ఏంటి ?

జీర్ణ‌క్రియ మెరుగు

లిచీ పండ్ల‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. దీని జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌రుస్తుంది. గ్యాస్ట్రిక్‌, జీర్ణ‌క్రియ‌కు అవ‌స‌ర‌మైన ద్ర‌వాల‌ను స్థిరీక‌రిస్తుంది. ఇది మ‌ల‌బ‌ద్ద‌కాన్ని నిరోధిస్తుంది.

Lychee : హైద‌రాబాద్‌లో ఎక్క‌డ చూసినా ఇవే పండ్లు? వీటి స్పెష‌ల్ ఏంటి ?

ర‌క్త ప్ర‌స‌ర‌ణ

లిచీ పండ్ల‌లో ఉండే కాప‌ర్‌.. ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌ను మెరుగుప‌రుస్తుంది. అలాగే ఎర్ర ర‌క్త‌క‌ణాల వృద్ధి కోసం లిచీ పండ్ల‌లో ఉండే కాప‌ర్‌, ఐర‌న్ స‌హాయ‌ప‌డ‌తాయి. ర‌క్తంలోని ద్ర‌వాల‌ను సంతులితం చేయ‌డం ద్వారా హైబీపీని నియంత్రించ‌డంలో లిచీ పండ్లు స‌హాయ‌ప‌డ‌తాయి. లిచీ పండ‌ల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. సోడియం త‌క్కువ‌గా ఉంటుంది. ఇవి ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌ను నియంత్రిస్తాయి.

Lychee : హైద‌రాబాద్‌లో ఎక్క‌డ చూసినా ఇవే పండ్లు? వీటి స్పెష‌ల్ ఏంటి ?

గుండెకు మంచిది

లిచీ పండ్ల‌లో గుండెకు ఆరోగ్యాన్ని ఇచ్చే పాలిపినాల్స్ అధికంగా ఉంటాయి. వీటిల్లో ఉండే బీటాకెరోటిన్‌, ఓలిగోన‌ల్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే ధ‌మ‌నులు, ర‌క్త‌నాళాల‌ను లిచీ పండ్ల‌లో ఉండే పొటాషియం ఆరోగ్యంగా ఉంచుతుంది. వాటి సంకోచ, వ్యాకోచాల‌ను మెరుగ్గా ఉంచుతుంది. దీనివ‌ల్ల ర‌క్త ప్ర‌స‌ర‌ణ సాఫీగా జ‌రిగి గుండెపోటు వ‌చ్చే ముప్పు త‌గ్గుతుంది.

Lychee : హైద‌రాబాద్‌లో ఎక్క‌డ చూసినా ఇవే పండ్లు? వీటి స్పెష‌ల్ ఏంటి ?

వృద్ధాప్య ఛాయ‌ల‌ను త‌గ్గిస్తుంది

వృద్ధాప్య‌ఛాయ‌ల‌ను తొల‌గించ‌డ‌లోనూ లిచీ పండ్లు స‌హాయ‌ప‌డ‌తాయి. అధిక ఆక్సిడేటివ్ ఒత్తిడి కార‌ణంగా శ‌రీరంలో ఫ్రీరాడిక‌ల్స్ పెరిగిపోతాయి. ఇది వృద్ధాప్య ప్రారంభ సంకేతాలుగా చెప్పొచ్చు. అయితే లిచీలో ఉండే విట‌మిన్ సీ.. శ‌రీరంలో నుంచి ఫ్రీరాడిక‌ల్స్‌ను బ‌య‌ట‌కు పంపిస్తుంది. స్కిన్ డ్యామేజిని నిరోధిస్తుంది.

Lychee : హైద‌రాబాద్‌లో ఎక్క‌డ చూసినా ఇవే పండ్లు? వీటి స్పెష‌ల్ ఏంటి ?

బ‌రువు త‌గ్గ‌డంలోనూ..

బ‌రువు త‌గ్గాల‌ని అనుకునేవారికి లిచీ పండ్లు గొప్ప మేలు చేస్తాయి. బ‌రువు త‌గ్గ‌డంలో ఇవి కీల‌క పాత్ర పోషిస్తాయి. వీటిలో నీటిశాతం ఎక్కువ‌గా ఉంటుంది. ఫ్యాట్ చాలా త‌క్కువ‌గా ఉంటుంది. కాబ‌ట్టి బ‌రువు త‌గ్గాల‌ని అనుకునేవారికి ఎంతో మేలు చేస్తుంది. క్యాల‌రీలు కూడా ఇందులో త‌క్కువ‌గానే ఉంటాయి.

Lychee : హైద‌రాబాద్‌లో ఎక్క‌డ చూసినా ఇవే పండ్లు? వీటి స్పెష‌ల్ ఏంటి ?

ఎముక‌ల దృఢ‌త్వానికి..

లిచీ పండ్ల‌లో మెగ్నీషియం, ఫాస్ప‌ర‌స్‌, ఐర‌న్‌, మాంగ‌నీస్‌, కాప‌ర్ వంటి న్యూట్రీషియ‌న్లు పుష్క‌లంగా ఉంటాయి. ఎముక‌లు కాల్షియాన్ని గ్ర‌హించే స్థాయిని ఇవి ఎంచుతాయి. దీనివ‌ల్ల ఎముక‌లు ఆరోగ్యంగా, దృఢంగా త‌యార‌వుతాయి.

లిచీ పండ్ల‌లో ఎన్ని పోష‌కాల జాబితా
న్యూట్రీషియ‌న్లు100 గ్రాముల లిచీలో
కేల‌రీలు66
ప్రోటీన్0.83 g
ఫ్యాట్‌0.44 g
కార్బొహైడ్రేట్లు16.5 g
ఫైబ‌ర్‌1.3 g
విట‌మిన్ సీ71.5 mg
Lychee : హైద‌రాబాద్‌లో ఎక్క‌డ చూసినా ఇవే పండ్లు? వీటి స్పెష‌ల్ ఏంటి ?

ఖాళీ క‌డుపుతో తింటే ప్ర‌మాదం

సాధార‌ణ పండ్ల‌తో పోలిస్తే లిచీ పండ్లు చాలా భిన్న‌మైన‌వి. వీటిని ప‌రిగ‌డుపున‌, రాత్రి ప‌డుకోబోయే ముందు అస్స‌లు తినొద్దు. ఈ పండ్ల‌లో ఉండే హైపోగ్లైసెమిక్ ఎన్‌సెఫాలోప‌తి ర‌క్తంలోని షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతుంటాయి. ఖాళీ క‌డుపుతో లేదా పౌష్టికాహార లోపం ఉంటే శ‌రీరంలో చ‌క్కెర‌స్థాయిలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. అలాంటి స‌మ‌యంలో ఈ పండ్ల‌ను తింటే చ‌క్కెర‌స్థాయులు తీవ్రంగా తగ్గిపోతాయి. దీనివ‌ల్ల ప్రాణానికే ముప్పు వాటిల్లే అవ‌కాశం ఉంది. ప‌చ్చి పండ్ల‌ను కూడా అస‌లు తినొద్దు. ప‌చ్చి లిచీ పండ్ల‌లో మిథిలెన్ సైక్లోప్రోపిల్-గ్లైసిన్ (MCPG) రసాయనం ఉంటుంది. ఇది మెద‌డు ప‌నితీరును దెబ్బ‌తిస్తుంది. మెద‌డు వాపు వ‌చ్చే ప్ర‌మాదం కూడా ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

ఒక్క మాస్క్ స‌రిపోదా? రెండు మాస్కులు క‌చ్చితంగా వాడాలా?

Oxygen Levels : ఇవి తినండి.. ఆక్సిజన్‌ లెవల్స్ పెంచుకోండి

Vaccine Doubts : క‌రోనా వ్యాక్సిన్ రెండు డోసులు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల్సిందేనా? ఒక్క డోస్ స‌రిపోదా?

బోర్లా ప‌డుకుంటే ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ పెరుగుతాయా.. ఆ వైర‌ల్ వీడియోలో నిజ‌మెంత‌?

Corona effect : ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ ఎలా పెంచుకోవాలి

Children Health : క‌రోనా టైంలో మీ పిల్ల‌లు మానసికంగా కుంగిపోకుండా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Advertisement
Lychee : హైద‌రాబాద్‌లో ఎక్క‌డ చూసినా ఇవే పండ్లు? వీటి స్పెష‌ల్ ఏంటి ?
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement