శనివారం 04 జూలై 2020
Rajanna-siricilla - Jun 30, 2020 , 02:35:27

కరోనా కట్టడికి సహకరించాలి

కరోనా కట్టడికి సహకరించాలి

  • n ప్రభుత్వ సూచనలు తప్పనిసరిగా పాటించాలి 
  • n ఎంపీపీ వంగ కరుణ
  • n వృద్ధులకు మాస్కుల పంపిణీ

గంభీరావుపేట: ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటి స్తూ కరోనా కట్టడికి సహకరించాలని ఎంపీపీ వంగ కరుణ కోరారు. ప్రభుత్వం ఉచితంగా అం దించిన మాస్కులను సోమవారం ఆమె లింగన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వృద్ధులకు పం పిణీ చేసి, మాట్లాడారు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ఉచితంగా మాస్కులు అందిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ముందుకుసాగాలన్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు రాజిరెడ్డి సముద్రలింగాపూర్ ఆరోగ్య ఉప కేంద్రంలో వృద్ధులకు మాస్కులు అందించారు. ఇందులో ఏఎంసీ చైర్మన్ లింగన్నగారి దయాకర్‌రావు, ఎంపీడీవో శ్రీనివాస్, వైద్యాధికారులు వెంకటేశ్, రాజ్యలక్ష్మి, ఉప సర్పంచులు దుబాసి రాజు, దేవేంద్రం, సీహెచ్‌వో రమేశ్, కొమిరిశెట్టి లక్ష్మణ్, దొంతినేని వెంకట్రావు, ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ఉన్నారు. 

వీర్నపల్లి: శాంతినగర్‌లో సర్పంచ్ కమటం మల్లేశం సోమవారం వృద్ధులకు మాస్కులు అం దించారు. కరోనా నేపథ్యంలో బయటకు వెళ్లే సమయంలో మాస్కులు ధరించాలని సూచించారు. ఉప సర్పంచ్ దేవేందర్, కార్యదర్శి ప్రవీణ్, ఏఎన్‌ఎం సుజాత, టీఆర్‌ఎస్ నేత చంద్రం, ఆశ కార్యకర్తలు ఉన్నారు.logo