శుక్రవారం 05 మార్చి 2021
Peddapalli - Jan 27, 2021 , 03:08:09

సింగరేణి ఓసీపీ-2లో ‘సాలార్‌' చిత్రీకరణ

సింగరేణి ఓసీపీ-2లో ‘సాలార్‌' చిత్రీకరణ

రామగిరి, జనవరి 26: ప్రముఖ సినీ నటుడు ప్రభాస్‌ నటిస్తున్న నూతన సినిమా ‘సాలార్‌'లోని ఓ ఫైటింగ్‌ సన్నివేశాన్ని రామగుండం-3 పరిధిలోని సింగరేణి ఓసీపీ-2లో చిత్రీకరించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ప్రముఖ కన్నడ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలోని ఓ సన్నివేశం చిత్రీకరణ కోసం పది రోజుల పాటు రామగుండం పరిధిలోని సింగరేణి ఓపెన్‌కాస్టు ప్రాజెక్టులను ఎంచుకున్నారు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం కల్లా చిత్ర యూనిట్‌ సభ్యులు ఆర్జీ 3 పరిధిలోని ఓసీపీ-2 ప్రాజెక్టు వద్దకు చేరుకొని సెట్టింగ్‌ పనులు ప్రారంభించారు. చిత్ర యూనిట్‌ సభ్యులకు సింగరేణి అతిథి గృహాలను కేటాయించినట్లు తెలిసింది. కాగా, రెండు, మూడు రోజుల్లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది.

VIDEOS

logo