సమాజ అభివృద్ధికి అవినీతి అడ్డంకి

- అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ
పెద్దపల్లి జంక్షన్: సమాజ అభివృద్ధికి అవినీతి అడ్డంకిగా మారుతున్నదని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ఈ నెల 9వ తేదీ దాకా అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక వారోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టరేట్ అధికారులతో కలిసి అవినీతి నిర్మూలనపై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, డిసెంబర్ 3 నుంచి 9వ తేదీ దాకా అవినీతి వ్యతిరేక వారోత్సవాలు నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి తీర్మానించిందని తెలిపారు. వీటికి సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేయాలని, కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమాన్ని యువత, స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగులు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో కే వై ప్రసాద్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ రవీందర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అవినీతి రహిత సమాజానికి కృషి చేయాలి
పెద్దపల్లి జంక్షన్: ప్రతి ఒక్కరూ అవినీతి రహిత సమాజానికి కృషి చేయాలని పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ సీహెచ్ తిరుపతి పిలుపునిచ్చారు. అంత ర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా గురువారం పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో ఉద్యోగులందరూ ప్రతిజ్ఞ చేశారు. ఇక్కడ మున్సిపల్ మేనేజర్ నయీంషా ఖాద్రి, ఆర్ఐ శివప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ కర్ణాకర్, జూనియర్ అసిస్టెంట్ రాజశేఖర్, కార్యాలయ అధికారులు ఉన్నారు.
జ్యోతినగర్(రామగుండం): రామగుండం తహసీల్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఇక్కడ రామగుండం డీటీ సురేశ్, ఆర్ఐలు ఫకిరప్ప, చంద్రమౌళి, ధరణి ఆపరేటర్ స్వప్న ఉన్నారు.
తాజావార్తలు
- కరోనా ఆంక్షలు.. నెదర్లాండ్స్లో భారీ హింస
- ఆరు మిలియన్ల ఫాలోవర్స్ సొంతం చేసుకున్న ప్రభాస్
- కూతుళ్ల హత్య కేసు.. తల్లికి వదలని క్షుద్రపిచ్చి..
- మన చరిత్ర సుధీర్ఘమైనది.. భారత్కు సందేశంలో ఆస్ట్రేలియా ప్రధాని
- దేశానికి బలమవుదాం.. కోహ్లి, రహానే రిపబ్లిక్ డే విషెస్
- అటవీశాఖ ఉద్యోగులకు పీసీసీఎఫ్ ప్రశంస
- చరిత్రలోఈరోజు.. రాజ్యంగం అమలులోకి వచ్చిన రోజు
- కూతుళ్ల హత్య కేసు.. తల్లీదండ్రులు అరెస్ట్
- వ్యాక్సిన్ సామర్థ్యంపై ఆస్ట్రాజెనెకా వివరణ
- మా నాన్నకు పద్మ అవార్డు ఇచ్చినందుకు థ్యాంక్స్