తెలంగాణ రాష్ర్ట అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగునెలల గడువు ఉన్నా, అన్నీ పార్టీలు అప్పుడే తమ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టాయి. సీఎం కేసీఆర్ అందరికంటే ముందు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. ముఖ్యంగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఒకరిని మించి మరొకరు ఎత్తులు, పై ఎత్తులు వేస్తున్నాయి. ఇతర పార్టీల్లోని అసంతృప్తులను, ముఖ్యంగా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టగల వారి కోసం గాలాలకు ఎరలను పెట్టుకొని సిద్ధంగా ఉన్నాయి.
ప్రజాసేవ చేసే వారికంటే డబ్బులు ఖర్చు పెట్టే వారికే టికెట్లు ఇవ్వడానికి ఆయా పార్టీలు ఆసక్తి చూపుతున్నాయి.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నికైంది మొదలు గడచిన తొమ్మిదేండ్లలో అనేక పథకాలు ప్రవేశపెట్టి సంక్షేమ ప్రభుత్వమంటే ఇలా ఉండాలి అనేలా పాలన సాగిస్తున్నారు. కేంద్రం పైసా ఇవ్వకున్నా ప్రజలకు ఏ లోటు రాకుండా చూసుకున్నారు. దాంతో కేసీఆర్ ప్రభుత్వమే మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
తెలంగాణ రాష్ర్ట సమితి, ఈ ఏడాది భా రత రాష్ర్ట సమితిగా మారింది. గత తొమ్మిదేండ్లుగా అధికారంలో ఉన్నా రాష్ర్టంలో ఇంకా దాని పట్టు సడలలేదు. 103 మంది శాసన సభ్యులతో, తిరుగులేని శక్తిగా కేసీఆర్ మిగతా అన్నీ పార్టీల కన్నా బలంగా ఉన్నారు. గత తొమ్మిదేండ్లలో ఆయన చేపట్టిన ప్రజా సంక్షేమ పనులే పార్టీని గెలిపిస్తాయని, అభ్యర్థులకన్నా కేసీఆర్ అనే బ్రాండే ప్రధానమని కార్యకర్తలు నమ్ముతున్నారు. అందుకే అభ్యర్థులు పాత వారు అయి నప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి రావాలని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రా వాలని తాపత్రయపడుతున్న జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు కనీసం సగం సీట్లలో కూడా బలమైన, ప్రజాబలం, కనీస గుర్తింపు ఉన్న నా యకులను అభ్యర్థులుగా చూపలేకపోతున్నా యి. వయసు మళ్లిన కాంగ్రెస్ నాయకుల్లోని అహం భావపూరిత ప్రవర్తన, ఒకరిపై ఒకరు చేసుకొనే విమర్శలు, ఆరోపణలతోనే పుణ్యకాలం గడిచి పోతున్నది.
ఇక బీజేపీ నాయకుల పరిస్థితి కూడా ఇందుకు ఏమాత్రం భిన్నంగా లేదు. గత శాసనసభలో ఐదుగురు సభ్యులున్న ఆ పార్టీ ప్రస్తుత సభలో ఒక స్థానానికి పడి పోయింది. ఉప ఎన్నికల పుణ్యమా అని మరో రెండు సీట్లు గెలుచుకో గలిగింది. కానీ ఆ పార్టీలో ఉన్న గ్రూపులు, వర్గాలతో ఎవరికి వారే నాయకులుగా చలామణి అవుతున్నారు. గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను తప్పించి కిషన్‌రెడ్డిని అధ్యక్షుడిని చేసింది బీజేపీ. అయినా పార్టీలో సమన్వయం తీసుకురాలేక పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు
ప్రజల్లో తన పలుకుబడి పెంచుకోవడం కోసం బండి ప్రయత్నించాడు. అది ఇష్టం లేని సొంతపార్టీ నాయకులే ఆయన పదవిని ఊడగొట్టారు. గతంలోనే కాదు, నేటికీ కాంగ్రెస్‌లో ఉన్న ఈ దుష్టసంస్కృతి ఇప్పుడు బీజేపీకి కూడా పాకడం తో ప్రజల్లోనే కాదు, పార్టీ క్యాడర్లో కూడాపార్టీ తీరుపట్ల, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు పోటీ ఇచ్చే విషయం పట్ల సందేహాలు మొదలయ్యాయి. దీంతో కార్యకర్తలు తలో దిక్కు చూస్తున్నారు.
కాంగ్రెస్‌పార్టీలో వయసు మళ్లిన నాయకులు తమ పట్టు కోసం పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని, ఆ పార్టీ క్యాడరే విమర్శిస్తున్నది. గత నాలుగైదు ఎన్నికల్లో ఓడిన నాయకులే మళ్లీ తమకే టికెట్ కావాలని, యువ నాయకత్వం పార్టీలోకి రాకుం డా అడ్డుకోవడం ఆ పార్టీ నైజంగా మారింది. లేచి నడవడానికి కూడా ఇబ్బందిపడే నాయకులు పార్టీలో ఇంకా తమ ఆధిపత్యమే ఉండాలనే ధోరణితో ప్రవర్తిస్తున్నారు. దీంతో విసిగిపోయిన క్యా డర్ పక్క చూపులు చూస్తున్నది.
ఇక బీజేపీ పూర్తిగా మతాన్ని ముందుపెట్టి ఎన్నికల్లో గెలవాలనే తాపత్రయంతో ముందు కు పోతున్నది. కానీ, ఉత్తర భారత రాజకీయా లు, దక్షిణ భారత రాజకీయాలు వేరనే అంశాన్ని ఆ పార్టీ అధి నాయకత్వం ఇంకా గుర్తించినట్టు లేదు. పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు. దీంతో కాంగ్రెస్‌లోని అసంతృప్త నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించడంలో కూడా ఒకే వర్గానికి చెందిన నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడంతో, మిగతా వర్గాలు పార్టీ తీరుపట్ల అసంతృప్తి తో ఉన్నాయి. అదే కాకుండా, రాష్ర్ట, కేంద్ర పార్టీ నాయకత్వాల ఆలోచనలు కూడా పార్టీ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
ఇక అధికార పార్టీ అంతా పాతవారికే టికెట్లు ఇచ్చింది. అభ్యర్థులు ఎవరైనా కేసీఆర్‌ను నమ్ముకున్న ప్రజలు ఆయన పాలననే కోరుకుంటున్నా రు. దేశంలో ఎక్కడాలేని విధంగా, తెలంగాణలో సంక్షేమపథకాలు అమలౌతున్నాయి. రెండు సా ర్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేప ట్టిన ప్రజా సంక్షేమం, ప్రవేశ పెట్టిన పథకాలు ప్రజలందరికీ చేరాయి. దీం తో తిరిగి కేసీఆర్ నాయకత్వ మే కావాలని ప్రజలు కోరు కుంటున్నారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కే పట్టం కట్టడానికి సిద్ధమ య్యారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నికైంది మొదలు గడచిన తొమ్మిదేండ్లలో అనేక పథ కాలు ప్రవేశపెట్టి సంక్షేమ ప్రభుత్వమంటే ఇలా ఉండా లి అనేలా పాలన సాగిస్తున్నారు. కేంద్రం పైసా ఇవ్వకున్నా ప్రజలకు ఏ లోటు రాకుండా పాలన సాగిస్తున్నారు. దాంతో కేసీఆర్ ప్రభు త్వ మే మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
అభ్యర్థుల వేటనే పూర్తి చేయలేని జాతీయ పార్టీలు, ఎన్నికల్లో బీఆర్ఎస్కు దీటైన అభ్యర్థులను పోటీలో నిలుప లేవని ప్రజలు, విశ్లేషకులు భావిస్తున్నారు. నిన్న మొన్న అభ్యర్థుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్న పార్టీలు తమ వడపోత ముగించుకోవడానికే పుణ్యకాలం కాస్తా గడిచిపోతుందని అనుకొంటున్నారు. నిజానికి ఈ రెండు పార్టీలకు కనీసం 50 స్థానాల్లో పోటీ చేయగల అభ్యర్థులు లేరనే విషయాన్ని ఆయా పార్టీల నాయకులే అంగీకరిస్తున్నారు.
బీఆర్ఎస్లో టికెటు లభించని ఆశావాహులు ఎవరైన తమ పార్టీలో చేరితే తమ పబ్బం గడుస్తుందన్న ఆలోచనలో ఆ పార్టీలు ఉన్నట్టు కనబడుతున్నది. బీఆర్ఎస్లో నిజంగా ప్రజాబలం ఉన్న నాయకులు బయటకు వెళ్తుంటే, ఇంత అనుభవం ఉన్న కేసీఆర్ వారిని వదులుకుంటా రా అన్న ప్రశ్న వీరికి కలగడం లేదు.
గత ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో గెలిచినా బీఆర్ఎస్లో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మరో ముగ్గురు స్వతంత్ర, టీడీపీ ఎమ్మెల్యేలు వచ్చి చేరారు. దీంతో పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 103కు చేరుకున్నది. అయితే ప్రస్తుతం వారిలో కొంతమందికి టికెట్ ఇవ్వ లేదు. వారి స్థానంలో కొత్తవారికి అవ కాశం కల్పించారు. పాత, కొత్త కల యికతో బీఆర్ఎస్ జోరుమీదున్నది. సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల మద్ధ తు మెండుగా ఉన్న బీఆర్ఎస్ను కాద ని జాతీయపార్టీలను ప్రజలు ఆదరిస్తారనుకోవడం వారి అతి విశ్వాసమే తప్ప మరొకటి కాదన్నది నిజం.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
-సిహెచ్వీ ప్రభాకర్ రావు
93915 33339