కల్లాకపటం లేనితనం, ఆత్మీయతల్లో అమ్మగుణం, గిరులనే తమ నివాసాలుగా మలుచుకొని, అక్కడ దొరికే ప్రకృతి సహజసిద్ధమైన వాటిని సేకరిస్తూ ప్రకృతితో మమేకమైన జీవనం గిరిజనులది. దశాబ్దాలుగా ఈ అడవితల్లి బిడ్డలు గుట్టలను చదును చేసి పోడు భూములను సాగు భూములుగా మలుచుకున్నారు. వర్షాధారంతోపాటు నీటి సౌకర్యంలేని ప్రాంతాల్లో గుంతలను తవ్వి నీటిని నిల్వ చేసుకుని పంటలు పండించుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. ఆ భూములకు పట్టాలు ఇవ్వాలని గత ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా హక్కులు దక్కలేదు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ వారి గోడు విని రాష్ట్ర వ్యాప్తంగా 1లక్షా 51వేల 146 మంది పోడు రైతులకు పట్టాలు అందజేసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.
గిరిజనుల దశాబ్దాల కల నెరవేర్చి పోడు సమస్యకు కేసీఆర్ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో అర్హులైన గిరిజనులకు పట్టాలు ఇచ్చేందుకు ఎర్పాట్లు జరిగాయి. పోడు భూములకు సంబంధించి 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 డిసెంబర్ 13కు ముందు వరకు సాగు చేస్తున్న వారిని అర్హులుగా గుర్తిస్తూ పోడు పట్టాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటవీ భూములను సాగు చేసుకుని బతుకుతున్న గిరి పుత్రులకే ఆ భూములపై హ క్కులు కల్పించిన సీఎం కేసీఆర్‌కు యావత్ గిరిజన జాతి జీవితాంతం రుణపడి ఉంటుంది.
గిరిజనులకు పోడు భూమిపై హక్కులు కల్పించేందు కు ఏర్పాటు చేసిన కమిటీకి కేసీఆర్ నన్ను చైర్మన్‌గా నియమించారు. గతంలోనే దరఖాస్తులు స్వీకరించిన ప్రభు త్వం క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తి చేసింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 47,138 ఎకరాలను 15,519 మం దికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పోడు పట్టాలను అందజేస్తుండటంతో మా జాతి చరిత్రలో సువర్ణ అధ్యా యం మొదలవుతున్నది. అత్యధికంగా పోడు ఉన్న భద్రా ద్రి కొత్తగూడెం జిల్లాలో 50,595 మందికి 1,51,195 ఎకరాలను మంత్రులు హరీశ్‌రావు, పువ్వా డ అజయ్‌కుమార్ పట్టాలు అందజేస్తారు. రెండవ స్థానం లో ఉన్న మహబూబాబాద్ జిల్లాలో 67,730 ఎకరాలను 24, 181 మంది పోడు రైతులకు మంత్రి కేటీఆర్, నేను పట్టాలు అందించనున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూములు ఉన్నటువంటి జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్ల సమక్షంలో జూన్ 30న రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు పట్టాలు అందజేస్తారు. గిరిజనులకు పట్టాలు ఇవ్వటంతో పాటు రైతుబంధు, రైతుబీమా పథకాలు వర్తించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణ యం తీసుకొన్నారు. పట్టాలు పొందే ప్రతి లబ్ధిదారుడి పే రుతో ప్రభుత్వమే బ్యాంకు ఖాతాను తెరిపించి బ్యాంకు ఖాతా నంబర్ ఆధారంగా రైతుబంధు అందించనున్నది.
మరోవైపు, పోడు పట్టాల పంపిణీతో అటవీ భూముల అన్యాక్రాంతానికి చెక్ పెట్టాలని సర్కారు నిర్ణయించింది, తమ కమతాల చుట్టూ ఉన్న ఫారెస్టు భూముల రక్షణ సదరు పట్టాదారులకే అప్పగిస్తుంది. తద్వారా ఆక్రమణలకు అవకాశం లేకుండా కట్టడి చేయడం జరుగుతుంది. దశాబ్దాల పాటు పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ పట్టాల కోసం ఎదురు చూస్తున్న పోడు రైతుల కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారు.
రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ పాలన గిరిజన సంక్షేమానికి ఒక స్వర్ణయుగం. గిరిజనుల అస్తిత్వాన్ని గుర్తించి, వారి అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ గిరిజనులపై ప్రేమను, చిత్తశుద్ధిని చాటిన గొప్ప నాయకుడు కేసీఆర్. గతేడాది సెప్టెంబర్ 17 న సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం గిరిజన రిజర్వేషన్ పెంచినందువల్ల గిరిజ న విద్యార్థులకు ఇంజినీరింగ్, మెడికల్ సీట్లు పెరిగాయి. టీఎస్పీఎస్సీలో గిరిజనులకు సుమా రు 903 పోస్టులు అదనంగా వస్తున్నాయి. అలాగే గిరిపుత్రులు సరస్వతిపుత్రులుగా రాణించాలనే ఉద్దేశంతో కేసీఆర్ గిరిజన గురుకులాలను ఏర్పాటు చేశారు. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ పేరిట విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించే పేద గిరిజన విద్యార్థులకు ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నది.
రాష్ట్రంలో 500 జనాభా దాటిన 2,471 గిరిజన తండాలను, ఆదివాసీ గూడేలను గ్రామ పంచాయతీలు గా మార్చి, ‘మా గూడెంలో మా రాజ్యం మా తండాలో మా పాలన’ కావాలని కోరుకున్న గిరిజన, ఆదివాసీ బిడ్డల దశాబ్దాల కలను సాకారం చేశారు. దీంతో ప్రస్తుతం మొత్తం 3,146 గిరిజన గ్రామ పంచాయతీలు రాష్ట్రంలో ఏర్పడ్డాయి. రాష్ట్రంలోని బంజారాల, ఆదివాసుల ఆత్మ గౌరవాన్ని సమున్నతంగా చాటే విధంగా రాష్ట్ర రాజధాని నడిబొడ్డున బంజారాహిల్స్‌లో అత్యంత ఖరీదైన స్థలాన్ని కేటాయించి రూ.50 కోట్లతో సంత్ సేవాలాల్ బంజారా భవ న్, కుమ్రంభీం ఆదివాసీ భవన్లను నిర్మించింది. 8 లక్షల మంది గిరిజన రైతులకు ఇప్పటి వరకు 8,305 కోట్ల రైతుబంధు అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. ఇలా ఒక్కటని కాదు గిరిజన అస్తిత్వాన్ని గుర్తించి ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనివిధంగా గిరిజన అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు గిరిజన సమాజం పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు.
(వ్యాసకర్త : గిరిజన సంక్షేమం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి)
భవిష్యత్తులో అటవీ భూముల పరిరక్షణే ధ్యేయంగా అటవీ శాఖతో కలిసి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. పోడుకు పట్టాలు ఇచ్చిన తర్వాత ఇకపై అంగుళం భూమి ఆక్రమణకు గురి కాకుండా పక్కాగా చర్యలు తీసుకునేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.