బీజేపీకి కేసీఆర్ అంటే భయం, బీఆర్ఎస్ అంటే దడ మొదలైంది. పలు ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్‌కు జై కొడుతుంటే బీజేపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ ధ్యేయంగా, ‘బీజేపీ ముక్త్ భారత్’ లక్ష్యంగా కేసీఆర్ చేస్తున్న రణ నినాదంతో మోదీకి నిద్ర పట్టడం లేదు. దీంతో కేసీఆర్‌ను బలహీనపరచాలన్న కుట్రలో భాగంగా కవితను లిక్కర్ స్కాంలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఉత్త ఆరోపణలే. బీజేపీ కుట్రలో ఇదొక భాగం. ఇదొక ఫేక్ స్కాం. అంతా బీజేపీ మాయ.
మహిళలు అంటే బీజేపీకి చిన్నచూపు. మోదీ పాలనలో దేశంలో పలు ప్రాంతాల్లో మహిళలు అనేక రకాల సమస్యలను,అవమానాలను ఎదుర్కొంటున్నారు. మతం పేరుతో వారిపై దాడులు జరుగుతున్నాయి. 75 ఏండ్ల స్వతంత్ర దేశంలో మహిళలు ఇప్పటికీ వివక్షను ఎదుర్కోవాల్సి రావటం దారుణం. వారిలో ఉన్న నైపుణ్యాలు బయటకు రావటానికి తగిన అవకాశాలే ఉండటం లేదు. స్వశక్తితో ముందుకుపోతున్న మహిళలను అణచివేయడం జరుగుతున్నది. బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ సమస్యలు అనేక రెట్లు పెరిగాయి.
బీజేపీని గద్దె దించేవరకూ కొట్లాటే. దేశం కోసం కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమిస్తాం. మీ ఈడీ, బోడీలకు జంకేదే లేదు. ఉద్యమాలే ఊపిరిగా పోరాడిన వాళ్లం. నిర్బంధాలను, అణచివేతలను తట్టుకుని నిలబడిన పోరు బిడ్డలం. ఆత్మగౌరవం, అస్తిత్వ ఉద్యమాలకు నిలువుటద్దం తెలంగాణ గడ్డ. బీజేపీ ముక్త్ భారత్, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ లక్ష్యాలుగా ముందుకు కదులుదాం.
ఈడీ, సీబీఐ దర్యాప్తు సంస్థల్ని కేంద్రం తన మీదికి ఉసిగొల్పుతున్నా ఉద్యమ సైనికురాలు కవితలో ఎటువంటి బెరుకు లేదు. ‘నేను నిర్దోషిని. ఏ తప్పు చేయలేదు. కావాలనే నాపై కుట్రపూరితంగా ఈ కేసు పెట్టారు. కేంద్రం చెప్పినట్టు ఈడీ వ్యవహరిస్తున్నది. ఒక మహిళ అని చూడకుండా పదే పదే విచారణ పేరిట ప్రశ్నిస్తూ, మీడియాకు లీక్‌లు ఇస్తూ నా ప్రైవసీకి భంగం కలిగించడం సరైంది కాదు’ అంటూ ఈడీకే చుక్కలు చూపిస్తున్నారు కవిత. తను వాడిన పాత ఫోన్లను ధ్వంసం చేశారని అభియోగం మోపితే, అది తప్పని మీడియా సాక్షిగా నిరూపించారు కవిత. తన పాత ఫోన్లు అన్నింటినీ ఈడీకి అప్పగించినప్పుడే ఆమె ఏ తప్పు చేయలేదని రుజువైంది. ఈ కేసు, విచారణ తతంగం అంతా బీజేపీ రాజకీయ కుట్రలో భాగమని దేశమంతా తెలుసు.
తనపై వచ్చిన అభియోగాలకు సంబంధించి కవిత ఇప్పటికే హైదరాబాద్‌లో, ఢిల్లీలో ఈడీ విచారణకు పలుమార్లు హాజరయ్యారు. ఈ విధంగా ఒక ఆడబిడ్డ ధైర్యంగా వ్యవహరిస్తుంటే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక నిందితుడిగా ఉన్న బీ ఎల్ సంతోష్ మాత్రం విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నారు. కవిత నిప్పులాంటి మనిషి. లక్ష కాదు కోటి కుట్రలు పన్నినా తెలంగాణ పోరాట యోధుడు కేసీఆర్ బిడ్డ కవిత మీ బెదిరింపులకు భయపడరు. ఇంకా ఎన్ని విచారణలు చేసినా నిర్దోషిగా నిప్పులా బయటకు వస్తుంది.
మహిళలు అంటే బీజేపీకి చిన్నచూపు. మోదీ పాలనలో దేశంలో పలు ప్రాంతాల్లో మహిళలు అనేక రకాల సమస్యలను, అవమానాలను ఎదుర్కొంటున్నారు. మతం పేరుతో వారిపై దాడులు జరుగుతున్నాయి. 75 ఏండ్ల స్వతంత్ర దేశంలో మహిళలు ఇప్పటికీ వివక్షను ఎదుర్కోవాల్సి రావటం దారుణం. వారిలో ఉన్న నైపుణ్యాలు బయటకు రావటానికి తగిన అవకాశాలే ఉండటం లేదు. స్వశక్తితో ముందుకుపోతున్న మహిళలను అణచివేయడం జరుగుతున్నది. బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ సమస్యలు అనేక రెట్లు పెరిగాయి. ఇతర దేశాల్లో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుంటే మన దేశంలో ఇప్పటికీ 15 శాతం కూడా ఉండటం లేదు. ఇన్నేండ్లయినా 33 శాతం రిజర్వేషన్ కల్పించకపోవడం ఏమిటి? మహిళా బిల్లు కోసం 27 ఎండ్లుగా ఎదురు చూపులు. ఇదేనా పాలకులు మహిళలకు ఇచ్చే గౌరవం. మహిళా బిల్లును పార్లమెంట్లో ఆమోదిస్తే స్త్రీలు తమ శక్తి సామర్థ్యాలతో జాతి భవితకు కొత్త వెలుగు దివ్వెలుగా రాణిస్తారు. అందుకనే బీఆర్ఎస్ నాయకురాలు కవిత మహిళా బిల్లుకు ఆమోదం తెలుపాలంటూ ఢిల్లీలో దీక్ష జరిపారు. ఈ అంశంపై యావత్ దేశం మరోసారి ఆలోచించేలా ఆమె పని చేశారు.
కానీ, మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించటానికి బీజేపీకి మనసు రావటం లేదు. అయితే, ఆ పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా వాటిని అధిగమించి మన దేశ మహిళాలోకం విజయం సాధిస్తుంది. దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ వస్తున్నది అనగానే బీజేపీ కుట్రలు ప్రారంభించింది. కేసీఆర్‌ను కట్టడి చేయడానికి కవితపై నిందలు వేశారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ము లేని కేంద్రప్రభుత్వం ఆడపడుచు కవితపై కేసుల పేరుతో బురద చల్లుతున్నది. తెలంగాణ ఉద్యమంలో భాగ మై, ప్రజానీకాన్ని జాగృత పరిచిన కవితపై ఇ టువంటి రాజకీయాలు చేయడం దుర్మార్గం. కేంద్రంలో అధికారం చేతిలో ఉందని గతంలో కాంగ్రెస్, నేడు బీజేపీ రాష్ర్టాలపై బెదిరింపులకు పాల్పడటం నియంతృత్వమే. ఇది దేశానికి ఏ రకంగానూ మంచిది కాదు. విచారణకు రమ్మంటే బీజేపీ సీనియర్ నేతగా పేరొందిన బీ ఎల్ సంతోష్ తప్పించుకుంటున్నారు. కానీ ఉద్యమ బిడ్డ కవిత ఈడీకి వివరణ ఇచ్చారు. ఆమె లాగా సంతోష్ కూడా భాజాప్తాగా విచారణ ఎదుర్కోవాలి కదా. తప్పు చేయలేదనే ధైర్యం ఉంటే దాక్కోవటం ఎందుకు?
మీ బెదిరింపులకు కవిత బెదిరిపోయే వ్యక్తి కాదు. ఎదురొడ్డి పోరాడే ఉద్యమ సైనికురాలు. నేటి తెలంగాణ మహిళా శక్తికి ప్రతీక కవిత. మహిళ లోకాన్ని సంఘటితం చేసే సత్తా ఉన్న నాయకురాలు. కేసీఆర్ నాయకత్వం కింద రానున్న విప్లవంలో మహిళలను ఐక్యపరిచే దిశగా కవిత ముందుంటారు. తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ ఆడటమే కాదు బడితె పట్టి కొట్లాడుడు కూడా వచ్చు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని ఆరోపణలు చేసినా ఈడీలు, బేడీలకు భయపడేది లేదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వీరోచిత సైనికురాలిగా పాల్గొని, తెలంగాణ జాగృతి ద్వారా ప్రజల్ని, ముఖ్యం గా మహిళల్ని చైతన్యపరిచిన ఘన త కవితకు ఉంది. ఉద్యమంలో, పార్టీలో అత్యంత చురుకైన నాయకురాలిగా గుర్తింపు పొందారు. కేసీఆర్‌లాగే గొప్ప వాగ్దాటి ఆమె సొంతం. బీఆర్ఎస్ ప్రస్థానంలో భాగం గా కవిత ముఖ్యమైన పాత్ర పోషించనున్నారు. దేశవ్యాప్తంగా ఆమెకు గుర్తిం పు లభిస్తుంది. ఇటువంటి సమయంలో బీజేపీ చిల్లర రాజకీయాలకు తెర లేపింది. వాటిని కవి త దీటుగా ఎదుర్కొంటారు. బీజేపీకి తప్పకుం డా గుణపాఠం నేర్పిస్తారు.
ఇక విశ్రాంతి అన్నదే లేదు. బీజేపీని ఢిల్లీలో గద్దె దించే వరకూ కొట్లాటే. దేశం కోసం కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమిస్తాం. మీ ఈడీ, బోడీలకు జంకేదే లేదు. ఉద్యమాలే ఊపిరిగా పోరాడిన వాళ్లం. నిర్బంధాలను, అణచివేతలను తట్టుకుని నిలబడిన పోరుబిడ్డలం. ఆత్మగౌరవం, అస్తిత్వ ఉద్యమాలకు ని లువుటద్దం మన తెలంగాణ గడ్డ. బీజేపీ ముక్త్ భారత్, అబ్ కీ బార్ కిసా న్ సర్కార్ లక్ష్యాలుగా ముందుకు కదులుదాం.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
-చిటుకుల మైసారెడ్డి
94905 24724