అహ్మదాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన విద్యార్హత, డిగ్రీ వివరాలు వ్యక్తిగత సమాచారం అని గుజరాత్ హైకోర్టు తెలిపింది. ఆర్టీఐ ద్వారా ఈ సమాచారం తెలపాల్సిన అవసరం లేదని తెలియజేస్తూ మాజీ సీఎం కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. ప్రధానమంత్రి అయినంత మాత్రాన మోదీ విద్యార్హతలు ప్రజా ప్రయోజనం కిందకు రావని వెల్లడించింది.
ప్రధాని విద్యార్హతలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని గతంలో కేంద్ర సమాచారశాఖ తెలిపిన విషయాన్ని ఈ సందర్భంగా కోర్టు గుర్తు చేసింది. గుజరాత్ యూనివర్సిటీ వెబ్సైట్లో ఇప్పటికే ఆ సర్టిఫికెట్లు అందుబాటులో ఉన్నాయని, అయినా కేజ్రీవాల్ కేసును కొనసాగించారంటూ సింగిల్ జడ్జి కేజ్రీవాల్‌పై విధించిన రూ.25వేల జరిమానాను హైకోర్టు సమర్థించింది.