రెండు దశాబ్దాలకు పైగా ప్రాంతీయ పార్టీ నేపథ్యం, తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఘనత టీఆర్ఎస్ సొంతం. అనతికాలంలోనే తెలంగాణను అనేక రంగాల్లో ప్రథమ స్థానంలో నిలిపిన పాలనానుభవంతో, రాష్ర్టాన్ని దేశానికి రోల్ మాడల్‌గా తీర్చిదిద్ది టీఆర్ఎస్ జాతీయ పార్టీ బీఆర్ఎస్గా ఆవిర్భవించింది. ప్రాంతీయపార్టీగా జాతీయస్థాయి పార్టీలకన్న అద్భుతంగా ప్రగతిపథంలో రాష్ర్టాన్ని తీర్చిదిద్దింది టీఆర్ఎస్. కాబట్టే తెలంగాణ మాడల్‌ను దేశమంతటికీ వర్తింపజేయడమే లక్ష్యంగా ఆవిర్భవించిన జాతీయ పార్టీ భారత రాష్ట్ర సమితి.
నాలుగు దశాబ్దాలకు పైబడిన రాజకీయానుభవం, ప్రజల అవసరాలను ఆకాంక్షలను అర్థం చేసుకున్న తీరు,తెలంగాణ పోరాట అనుభవాలు, తన ఆలోచనల్లోంచి వచ్చిన తెలంగాణ అభివృద్ధి మాడల్, ప్రజలతో సాన్నిహిత్యం కేసీఆర్‌ను రాష్ర్టానికే పరిమితమైన నాయకుడిగా ఉండనీయలేదు.
డబ్బు ఐదేండ్ల స్వాతంత్య్ర దేశంలో దక్షిణాది నాయకత్వంలో ఏర్పడిన ఏకైక జాతీయ పార్టీ బీఆర్ఎస్. ఇన్నేండ్లలోనూ దేశ మౌలిక సమస్యలేవీ పరిష్కారం కాని అనివార్యత నుంచి బీఆర్ఎస్ ఏర్పడింది. ఇన్నాళ్లు దేశాన్నేలిన కాంగ్రె స్, బీజేపీ, జనతా, పరోక్షంగానైనా కమ్యూనిస్టు పార్టీలు సామాజిక అంతరాలను, ఆర్థిక అసమానతలను తగ్గించలేకపోయాయి. కుల, మత అం తరాలను రూపుమాపి మనమంతా భారతీయు లమనే భావనను కలిగించలేకపోయాయి.
కాంగ్రెస్, కమ్యూనిస్టులు జాతీయ పార్టీలుగా దేశ సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయి. ఇక బీజేపీ పాలనైతే మరీ అధ్వాన్నంగా ఉన్నది. సామాజిక అంతరాలు, కుల, మతాల వైరుధ్యాలను మరింత పెంచి దేశ సంపదనంతా కొద్దిమంది కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి పోయేట్టు
చేస్తున్నది.
మనుష్యుల మధ్య సహెూదరత్వాన్ని దూరం చేసి ద్వేషాన్ని పెంచుతున్నది. మతాన్ని ఓ విశ్వాసంగా కాకుండా ఓటుబ్యాంకుగా ఉపయోగించుకుంటూ దేశంలో ఉద్రిక్తతలను పెంచుతున్నది. ప్రపంచంలోనే సర్వోత్తమమైనదిగా భావింపబడే భారత రాజ్యాంగాన్ని మార్చి మనుష్యులను విభజించే ప్రయత్నంలో ఉన్నది. ఇలాంటి అనేక సమస్యల వలయాన్ని ఛేదించి ప్రజాస్వామ్య భారతాన్ని స్థాపించడమే బీఆర్ఎస్ లక్ష్యం.
స్వాతంత్య్రం వచ్చి ఏండ్లు గడిచినా ఆహారం, నీరు, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట వంటి కనీస అవసరాలు తీర్చలేదంటే అది దేశాన్ని పాలించిన, పాలిస్తున్న పార్టీల వైఫల్యం తప్ప ప్రజల తప్పు కాదు. వ్యవసాయిక దేశంలో పంట లు పండటానికి అవసరమైన సాగునీరు, తాగడానికి తాగునీటి సమస్య కూడా తీర్చలేని ప్రభుత్వాలు దేశాన్నేలాయి, ఏలుతున్నాయంటే అంత కంటే విషాదం ఏముంటుంది? దేశానికి అన్నమందించే రైతే ఆత్మహత్య చేసుకోవడం, రోడ్లపైకెక్కి పాదయాత్రలు, ధర్నాలు, నిరసనలు, సమ్మెలు చేయడం ఈ దేశంలో మాత్రమే ఉందేమో!
సువిశాలమైన, మానవీయమైన, తనదైన దేశీ య అభివృద్ధి నమూనాను దేశమంతటా వ్యాపింపజేసి దేశ మౌలిక సమస్యలకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితిని ఆవిష్కరించారు కేసీఆర్. దక్షిణాది నుంచి, అందులో బుద్ధభూమి తెలంగాణ నుంచి ఓ జాతీయపార్టీ రావ డం ఓ అద్భుతం. కొద్దికాలంలోనే మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్ మరికొన్ని ప్రాంతాల నుంచి ఈ పార్టీకి మంచి స్పందన రావడం గొప్ప విశేషం. ఓ చిన్న రాష్ట్రం నుంచి జాతీయ పార్టీ రావడమేంటని గొంతు చించుకునే వాళ్లున్నారు. కానీ, జాతీ యపార్టీలను స్థాపించిన నాయకులందరూ ఏదో ఒక రాష్ర్టానికి చెందినవారే అన్నది నిజం.
అంతేకాదు స్వాతంత్య్రానికి పూర్వం నుంచి ఇప్పటివరకూ దక్షిణాది రాష్ర్టాలు, ప్రజలు ఉత్తరాది పాలకుల నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నారు. దక్షిణాది రాష్ర్టాలకు నిధులివ్వడంలో, నీటి వాటా పంపకంలోనూ వివక్షే. ఇలాంటి అనేక సమస్యలను పరిష్కరించి మనమంతా భారతీయులం, భారతీయులంతా ఒక్కటే అనే విశాల దృక్పథాన్ని పెంపొందించి దేశాన్ని ఐక్యం చేయడానికే కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారు. ఆయనకు దేశంపై, దేశ రాజకీయ ముఖచిత్రంపై స్పష్టమైన అవగాహన ఉన్నది. దేశాభివృద్ధి మాడల్‌పై స్పష్టమైన విజన్ ఉన్నది. అన్ని విషయాల్లో స్పష్టత ఉన్నది కాబట్టే తొమ్మిదేండ్ల స్వల్పకాలంలోనే తెలంగాణను దేశపటంలోనే కాదు, ప్రపంచపటంలో స్థానం పొం దేట్టు చేయగలిగారు. తెలంగాణ ఆచరిస్తున్నదా న్నే దేశం అనుసరిస్తున్నది. కేంద్రంలో బీఆర్ఎస్ చక్రం తిప్పితే దేశం ఆచరించేదాన్ని ప్రపంచం అనుసరిస్తుందన్నది వాస్తవం.
బీఆర్ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాల్లో నూతన శకం ఆరంభమైంది. తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణలో జరిగిన బృహత్కార్యక్రమాలను, కట్టడాలను, పథకాలను పరిశీలిస్తే అర్థమవుతుం ది. ఇవన్నీ ఒక్క రాష్ర్టానికే కాదు, కేంద్రస్థాయిలో దేశానికి వర్తింపజేస్తే చాలా సమస్యలకు పరిష్కా రం లభిస్తుంది. కేసీఆర్ అధికారంలోకి రాగానే నాగార్జునసాగర్ వద్ద బుద్ధవనం కట్టడానికి అనుమతించారు. దాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా, బౌద్ధధర్మ సర్వస్వ కేంద్రంగా మార్చి చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. అలాగే అపర బోధిసత్వుడు అంబేద్కర్ విగ్రహాన్ని దేశం లో ఎక్కడా లేనంత ఎత్తులో 125 అడుగుల మూర్తిని కట్టించడం ఓ చరిత్రే. అక్కడ అడుగుపెట్టిన పర్యాటకులకు, రోజూ సచివాలయంలోకి వెళ్లే ఉద్యోగులకు, సచివాలయ సందర్శకులకు ఎంతో స్ఫూర్తి కలుగుతుంది. రాజ్యాంగం పట్ల గౌరవం పెరుగుతుంది. అలాగే యాదగిరిగుట్టను ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మార్చి, రోజుకు వేల సంఖ్యలో పర్యాటకులు వచ్చే వసతులు కల్పించడం పర్యాటకాభివృద్ధికి మచ్చుతునక. ఇంకా పాలకుర్తి, కుంతాల జలపాతం, రాష్ట్రం లో బౌద్ధ క్షేత్రాలు, దేవాలయాలను, పుణ్యక్షేత్రాలుగా, పర్యాటక స్థలాలుగా మార్చి కేసీఆర్ ప్రజల గుండెల్లో శాశ్వతస్థానం సంపాదించుకున్నారు.
వ్యవసాయమే ఈ దేశంలో ప్రధానవృత్తి. ఇక్కడ కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న ది. గంగా, యమున, మహానది, గోదావరి, కావే రి, కృష్ణ లాంటి జీవ నదులున్నాయి. కానీ ఆ నీటి ని పంట భూములకు మళ్లించింది చాలా తక్కువ. గోదావరి వరదనీరు వృథాగా సముద్రం లో పడకుండా కాళేశ్వరం దగ్గర గోదావరిపై నిర్మించిన ఇంజినీరింగ్ వండర్ కాళేశ్వరం ప్రాజె క్టు. దీనితో లక్షల ఎకరాలకు సాగునీరంది తెలంగాణ ‘పంట సిరి’గల రాష్ట్రంగా మారింది. కేసీఆర్ స్వల్పకాలంలోనే రైతుకు, తెలంగాణ గడపగడపకు సాగునీరు, తాగునీరిచ్చి వ్యవసాయాన్ని పండుగ చేశారు. అన్నిపార్టీలు ఏవేవో మాయమాటలు చెప్పి తమకు ఓటు వేయమంటుంటే బీఆర్ఎస్ మాత్రం ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అంటున్నది.
రైతుబంధు చిన్న రైతుల పాలిట వరమైతే, దళితబంధు సమాజపు అట్టడుగున ఉన్న దళిత సామాజికవర్గాన్ని చిరు పారిశ్రామికవేత్తలుగా మార్చింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఉచిత కరెంటు ఇంకా అనేక పథకాలు, విద్య, వైద్య, ఉద్యోగ కల్పన రంగాల్లో విప్లవాత్మక చర్యలు తీసుకొని ప్రతి ఇంటిగడపకూ కనీస అవసరాలు అందేట్టు చేసిన ప్రజానాయకుడు కేసీఆర్.
తెలంగాణలో జరిగిన అభివృద్ధి నమూనాను, రైతును రాజును చేసే పథకాలను, సామాజిక ఆర్థిక అంతరాలను తగ్గిం చే చర్యలను మ్యానిఫెస్టోగా భారతరాష్ట్ర సమితి జాతీయ రాజకీయాల్లో నూతన శకానికి దారులు వేస్తున్నది. బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలను శాసించే స్థితి ఖాయమన్నది చారిత్రక సత్యం.
-డాక్టర్ కాలువ మల్లయ్య
91829 18567