నా తెలంగాణ ప్రజలారా! సమస్త ఉద్యోగ, రైతు సోదరులారా.. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే.. 1956 నుంచి 2014 దాకా మనకు హక్కుగా దక్కాల్సిన ఉద్యోగాలు, నిధులు ఇవ్వక, సేద్యం కోసం నీళ్లు ఇవ్వక మన రైతాంగాన్ని అప్పటి ఆంధ్ర పాలకులు నానాయాతనలకు గురిచేశారు. వారి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కేసీఆర్ నాయకత్వంలో అలుపెరగని పోరాటం చేసి 2014లో తెలంగాణను సాధించుకున్నాం.
స్వరాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధికి కావాల్సిన నీళ్లు, విద్యుత్తు, ఉద్యోగ నియామకాలు, మౌలిక వసతుల కల్పనకు కేసీఆర్ సర్కారు తొలి ప్రాధాన్యం ఇచ్చింది. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇంటింటికి తాగునీరు, ఉచిత కరెంటు లాంటి ఎన్నో పథకాలను తీసుకొచ్చింది. ప్రాజెక్టులు, కాలువల ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లు పారించడమే కాకుండా మోటర్లకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రతి మండలంలో దవాఖానలు పెట్టి, నయా పైసా ఖర్చు లేకుండా ప్రతి వ్యక్తికి ఉచితంగా ఎన్నో పరీక్షలు జరిపించింది.
తద్వారా దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్ పాలన ‘రామరాజ్యం’గా పేరొందింది. అల్లర్లు, కులమతాల వైషమ్యాలు లేకుండా ప్రజా పాలన సాగిస్తూ కేసీఆర్ హయాంలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందింది. ఇదే కాంగ్రెస్, బీజేపీలకు కన్నుకుట్టేలా చేసింది. అప్పటి బీఆర్ఎస్ నాయకులు, ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరిన నాయకులకు ఎలాంటి కమీషన్లు ఇవ్వకుండా వారి నోర్లు కట్టినందుకు, వాళ్లు ఇవ్వాళ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ముక్కలు ఆంధ్ర వాళ్లు తిని, బొక్కలు పడేయంగనే వీరి నోర్లు మూతబడ్డాయి.
1969 నాటి ఉద్యమంలో 369 మంది తెలంగాణ విద్యార్థులు, రైతులు చనిపోయినా కఠిన హృదయమున్న ఇందిరాగాంధీ తెలంగాణ ఇవ్వకుండా మోసం చేశారు. దానికితోడు అప్పటి తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్) నాయకులకు గవర్నర్, మంత్రి, ఇతర పదవులు ఇవ్వడంతో వారి నోర్లు మూతబడి, టీపీఎస్ అర్ధాంతరంగా మూతబడింది.
ఇప్పుడున్న కె.కేశవరావు కూడా అపరాధియే. స్వలాభం కోసం ఏమైనా చేసే రకం. బీఆర్ఎస్లో ఉండి పదవులు అనుభవించి, కేసీఆర్‌ను మోసం చేసిన అవకాశవాది. ఆయనను ఎంత అన్నా తక్కువే. కాంగ్రెస్‌లో చెల్లని రూపాయిగా మారిన కేకే వంటి చాలా మంది కాంగ్రెస్ నాయకులకు కేసీఆర్ ఆశ్రయం ఇచ్చి ఆదరించారు. కానీ, నేడు అందుకు ప్రతిఫలంగా దుష్ట పరిపాలనకు సలహాదారుడిగా మారి కేసీఆర్‌పై కుట్రలను ప్రోత్సహిస్తున్న వీరిని ఏం చేసినా తప్పు లేదు.
కేసీఆర్‌ను, హరీశ్‌రావును, అప్పటి ఇంజినీర్లను దోషులుగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును చూసిన విదేశీయులు కూడా దాన్ని ఒక ప్రపంచ అద్భుతంగా కీర్తించారు. కాళేశ్వరం ద్వారా శ్రీరాంసాగర్, బంజేపల్లి, నిజాంసాగర్, రాష్ట్రంలోని అన్ని చెరువులు, కుంటలను నింపి కంపెనీల అవసరాలకు నీళ్లు ఇస్తూనే, తాగునీరు, వ్యవసాయానికి సాగునీరు అందించారు.
2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించి, జయశంకర్ సార్ ప్రోత్సాహంతో అలుపెరగని పోరాటాలు చేసి, కేంద్రంలోని అనేక పార్టీలను ఒప్పించి, తెలంగాణ ఆవశ్యకతను వారికి చెప్పి, పార్లమెంట్లో బిల్లు పెట్టించి మరీ ప్రత్యేక తెలంగాణకు ఊపిరిపోసిన కేసీఆర్‌ను తెలంగాణ గాంధీ అని పిలవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మన రైతులు, ఉద్యోగులు పడుతున్న కష్టాలకు చెక్ పెట్టిన తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్. 2014లో పోరాట ఫలితంగా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైంది. అంతేకానీ, కాంగ్రెస్ వాళ్లు అంటున్నట్టు సోనియమ్మ ఇవ్వలేదు. ఇప్పటి కాంగ్రెస్ అధిష్ఠానం ‘కనులుండి చూడలేరు, మనసుండి కానలేరు’ అన్నట్టుగా.. తెలంగాణపై కక్షగట్టిన బీజేపీ మన రాష్ర్టానికి రావాల్సిన నిధులను ఇవ్వలేదు.
అయినా మొక్కవోని దీక్షతో తెలంగాణను అభివృద్ధి పథాన నిలిపిన కేసీఆర్‌ను బద్నాం చేయడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాము చెప్పిన విధంగా రిపోర్టు ఇచ్చేందుకే కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ పేరిట జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించారు. కాబట్టి కాంగ్రెస్, బీజేపీ నేతల చెప్పుడు మాటలు విని జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక తయారు చేసినట్టుగా అనిపిస్తున్నది. కాళేశ్వరం కింద సాగుబడి చేస్తున్న రైతులను, బడిపిల్లలను, గ్రామస్థులను, స్త్రీలను కలిసి వారి అభిప్రాయాలను కూడా సేకరించి ఉంటే, 19 నెలల క్రితం వచ్చిన నీళ్లు, కరెంటు ఇప్పుడెందుకు రావడం లేదన్న విషయాలు పూర్తిగా ఆయనకు తెలిసేవి. ఏ ప్రభుత్వంలో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారు, ఏ ప్రభుత్వంలో కష్టాలు అనుభవిస్తున్నారో కూడా తెలిసేది.
కేసీఆర్‌ను, హరీశ్‌రావును, అప్పటి ఇంజినీర్లను దోషులుగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును చూసిన విదేశీయులు కూడా దాన్ని ఒక ప్రపంచ అద్భుతంగా కీర్తించారు. కాళేశ్వరం ద్వారా శ్రీరాంసాగర్, బంజేపల్లి, నిజాంసాగర్, రాష్ట్రంలోని అన్ని చెరువులు, కుంటలను నింపి కంపెనీల అవసరాలకు నీళ్లు ఇస్తూనే, తాగునీరు, వ్యవసాయానికి సాగునీరు అందించారు.
కాంగ్రెస్ అధికారం చేపట్టిన ఈ 19 నెలల నుంచే నీటి కష్టాలు ఎందుకు వస్తున్నాయి? చేలు ఎందుకు ఎండుతున్నాయి? ప్రజలకు తాగునీరు ఎందుకు రావట్లేదు? వ్యవసాయానికి నీళ్లు ఇవ్వాలని రైతులు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారు? ఈ ప్రశ్నలకు ‘ప్రజా ప్రభుత్వం’ సమాధానం చెప్పాలి. పక్క రాష్ర్టానికి చెందిన రిటైర్డ్ అధికారులను సలహాదారులుగా పెట్టుకుని ఏం సాధించారు? తెలంగాణను ఎండబెట్టి, ఆంధ్రను సుభిక్షం చేయడమేనా?
రైతుభరోసా, ఆసరా, కల్యాణలక్ష్మి-తులం బంగారం, రెండు లక్షల ఉద్యోగాలు, ఉద్యోగులకు పీఆర్సీ-డీఏలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి హామీలను ఈ ప్రభుత్వం నెరవేర్చాలి. గురుకులాల్లో నాణ్యమైన ఆహారం అందించాలి.
జై కేసీఆర్! జై తెలంగాణ! జై భారత్!
– (వ్యాసకర్త: రిటైర్డ్ ఆఫీసర్ సర్వేయర్, సర్వే ఆఫ్ ఇండియా)
ఎస్.శంకర్ 94942 34692