కష్టజీవుల వెతలకు ప్రతిబంబం లాంటివాడు కవి అయితే, సమస్త రంగాల ప్రజల జీవనరీతులకు ప్రతీక లాంటి వాడు జర్నలిస్టు. జర్నలిస్టులది ప్రతిపక్ష పాత్ర. నిజాయితీ, నిర్భీతి జర్నలిస్టులకు కవచకుండలాల వంటివి. ఇలాంటి అర్హతలన్నీ సంపూర్ణంగా గల జర్నలిస్టు, తెలంగాణ మట్టి బిడ్డ షోయబుల్లాఖాన్. ‘తరతరాల బూజు నిజాం రాజు’ అని దాశరథి కృష్ణామాచార్యులవారన్నారు. ఆ నవాబు చేసే ప్రతి ప్రజాకంటక పనిని లోకానికి ఎలుగెత్తి తన వార్తల రూపంలో చాటి చెప్పిన వాడు షోయబుల్లా ఖాన్.
షోయబుల్లాఖాన్ గొప్ప దేశ భక్తుడు. తన ప్రాంత విముక్తి కోసం నిజాం నిరంకుశ పాలన అంతం కోసం కంకణం క ట్టుకుని పనిచేసిన వాడు. అందుకే తెలంగాణ సమాజం ఆయనను నిరంతరం గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. పోరాటాల ఖిల్లా ఖ మ్మం జిల్లాలో 1920లో జన్మించిన షోయబుల్లాఖాన్ 1948 ఆగస్టు 22న నిజాం పెం చి పోషించిన రజాకార్ల ముఠానాయకుడు ఖాసీం రజ్వీ చేతిలో దారుణ హత్యకు గురయ్యా డు. ఏటా ఆయన జయంతి, వర్ధంతులను తెలంగాణ సమాజం గుర్తుచేసుకుంటూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నది.
‘జనం కోసం జర్నలిస్టులు’, ‘తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు’ అనే స్ఫూర్తిని ఆయన నుంచే ‘తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం’ అందిపుచ్చుకున్నది. ఆనాడు నిజాం నిరంకుశ వ్యతిరేక పోరాటంలో తన కలం ద్వారా నాటి సమాజాన్ని చైతన్యవంతం చేశాడు షోయబ్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం ఉద్యమ పంథాను ఎంచుకున్నది టీజేఎఫ్.
జర్నలిస్టులకు ఎప్పుడూ ఉద్యోగ భద్రత ఉండదు. ఆయన జీవితమూ అంతే. ముం దుగా ఆయన త్యాజీ పత్రికలో పనిచేశారు. ఆ తర్వాత రయ్యత్, అటు తర్వాత ఇమ్రోజ్ పత్రికల్లో పనిచేశారు. ఓ వైపున తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, మరో వైపు రజాకార్ల ఆగడాలు. అలాంటి పరిస్థితుల్లో ఆయన సాయుధపోరాట మార్గమైన కమ్యూనిస్టుల మార్గంలో నడిచారు.
ఖమ్మం జిల్లా ఆదివాసీల తిరుగుబాట్లు జరిగి చైతన్యం పొందిన ప్రాంతం. అక్కడే పుట్టడంతో ఆ ప్రేరణ కూడా ఆయనకు ఉన్నది కాబట్టే తాను తిరుగుబాటు మార్గంలో మా తృభూమికి స్వేచ్ఛను ప్రసాదించే పోరాటంలో భాగం అయ్యాడు. పాకిస్థాన్‌కు నాటి నిజాం ప్రభుత్వం ఆర్థిక సాయం చేయడాన్ని వ్యతిరేకిస్తూ తీవ్రస్థాయిలో విమర్శనాత్మక వ్యాసాలు రాశాడు. తెలంగాణ ప్రజల గోర్లు ఊడగొట్టి, రక్తమాంసాలను పిండి వసూలు చేసిన డబ్బు ను పాకిస్తాన్‌కు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. అప్పటికే అనల్ మాలిక్ సిద్ధ్దాంతాన్ని నిజాం నవాబులు ప్రచారంలో పెట్టారు. అంటే సంస్థానంలో ఉన్న ప్రతి ముస్లీమూ ఓ నిజాం ప్రభువే అని అర్థం. కానీ షోయబ్ ముస్లీం అయి ఉండి నిజాంకు వ్యతిరేకంగా వార్త లు ప్రచురించడం ఏమిటని ఖాసీం రజ్వీ కన్నె ర్ర జేశాడు. చంపేస్తానని బెదిరించాడు. అయి నా షోయబ్ బెదర లేదు. మరింత పదునుగా వ్యాసాలు రాశాడు. ఎందుకంటే ఆయన అస లు సిసలైన దేశభక్తుడు కాబట్టి. చివరకు ఖాసీం రజ్వీ అన్నంత దుర్మార్గం చేశాడు. షో యబుల్లాఖాన్ను దారుణంగా హత్య చేశా డు. తెలంగాణ సమాజం తీవ్రంగా స్పందించింది. కమ్యూనిస్టులు, స్టేట్ కాంగ్రెస్ నాయకులు పలు రూపాల్లో చేసిన పోరాటానికి నాటి ని జాం నవాబు లొంగిపోక తప్పలేదు. నిత్యం ప్రజల కోసం పనిచేసిన దేశభక్తయుత జర్నలిస్టు షోయబుల్లా ఖాన్.
సరిగ్గా ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలోకి వచ్చారు తెలంగాణ జర్నలిస్టులు. 2001 నుం చి 2014 జూన్ 2 వరకు ఒక ప్రత్యేక పాత్ర పోషించారు. ఆంధ్ర పాలకులు ఎన్ని నిర్బంధాలు పెట్టినా దాన్ని బద్దలు కొట్టి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం ముందు వరసలో నిలిచారు. ఒక ప్రత్యేక రైలు తీసుకొని దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్‌లో కలాల కవాతు చేశారు. అసెంబ్లీలో బిల్లు పెట్టేటప్పుడు ఫ్లోర్ మేనేజ్మెంట్ విషయంలో అన్ని పార్టీలను ఒక్క చోటికి చేర్చి అనుసరించాల్సిన వ్యూహం పై ప్రత్యేకంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత టీజేఎఫ్ ‘తెలంగాణ యూ నియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్’గా రూపాంతరం చెందింది.
మలివిడత ప్రత్యేక రాష్ర్టోద్యమంలో సీమాంధ్ర మీడియాకు భయపడకుండా, తమ ఉద్యోగాలు పోతాయనే భ యం లేకుండా ముందు నిలిచారు తెలంగాణ జర్నలిస్టు లు. తాము తెలంగాణ సమా జం పక్షాన ఉంటామని చె ప్పా రు. చెప్పడమే కాదు. చే సి చూపించారు. ప్రతీ సందర్భంలో చరిత్రీత్మక పాత్ర నిర్వహించారు. తాము ముమ్మాటికీ ప్రజాపక్షమేనని నిరూపించుకున్నారు. చరిత్రలో నిలబడ్డారు. తాము షోయబ్ వారసులమని లోకానికి చాటి చెప్పారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేసిన జర్నలిస్టులను గాలికొదిలేయలేదు ఈ ప్రభుత్వం. స్వయం పాలనలో జర్నలిస్టులకు సముచిత స్థానం ఇచ్చింది. అందుకే మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా అల్లం నారాయణను ము ఖ్యమంత్రి, ఉద్యమనాయకుడు కేసీఆర్ నియమించిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. 20వేల మందికిపైగా ఫీల్డ్ జర్నలిస్టులతో పా టు డెస్క్ జర్నలిస్టులకూ అక్రిడేషన్ కార్డులు ఇచ్చారు. కరోనా కష్టకాలంలో మహమ్మారి బారిన పడిన జర్నలిస్టులకు నేరుగా వారి అకౌంట్లో రూ.20 వేలు వేసింది మీడియా అకాడమీ. అకాల మరణం పొందిన జర్నలిస్టు ల కుటుంబాలకు ఆర్థికంగా సాయం అందిస్తున్నది. దాదాపుగా ఈ ఆరేండ్ల కాలంలో జర్నలిస్ట్‌ల సంక్షేమం కోసం రూ.18 కోట్లు మీడి యా అకాడమీ ద్వారా ఖర్చు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన 42 కోట్ల సంక్షేమనిధితో ఇది సాధ్యమైంది. దాదాపు మరో వంద కుటుంబాలకు ఈనెల 23న టూరిస్ట్ ప్లాజాలో జరిగే కార్యక్రమంలో లక్ష చొప్పున మీడియా అకాడమీ అందించనున్నది.
ఇదంతా చెప్పడం వెనుక ఓ పరిణామక్రమాన్ని, చోటు చేసుకున్న మార్పును. నాటి నిజాం వ్యతిరేక పోరాటం నుంచి మొన్నటి సీమాంధ్ర పెత్తందారి వ్యతిరేక పోరాటంలో ఈ నేల జర్నలిస్టుల పోరాట, ఆరాటాలను, ఆర్తిని వేదనను గుర్తు చేసేందుకోసమే. తెలంగాణ జర్నలిస్టులు షోయబుల్లాఖాన్ స్ఫూర్తితోనే ఉన్నారు. ఉంటారు కూడా.
ప్రజల పక్షాన నిలబడుతూ ఈ నేల చైతన్యాన్ని ప్రజలకు నిజానిజాలు నిర్భయంగా చెప్పేందుకు, వారి జీవితాల్లో వస్తున్న వాస్తవిక మార్పులను చూపెడుతూ ముందుకు సాగుతున్నారు. ఇంతటి చరిత్రలో భాగమై తన జీవితాన్ని జర్నలిజానికి అంకితం చేసిన చారిత్రక జర్నలిస్టు షోయబుల్లాఖాన్‌కు టీయూడబ్ల్యూజే ఘన నివాళు లు అర్పిస్తున్నది.
(వ్యాసకర్త :ప్రధాన కార్యదర్శి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు)