కేసీఆర్.. ఈ పదం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పరిచయమైంది. ఎందుకంటే.. దగా పడ్డ తెలంగాణ అస్తిత్వాన్ని కనుమరుగు చేసే ప్రమాదాన్ని పసిగట్టి.. ఆయన తెలంగాణ కోసం ఉక్కుమనిషిలా నిలబడ్డారు. వలసల తెలంగాణ, పురిటినొప్పులకు ఓర్చి.. బిడ్డకు జన్మ ఇచ్చినా.. ఆ బిడ్డలను సాదలేక దత్తతగానో.. మరో విధంగానో బిడ్డలను పరాయి వారికి ఇచ్చి తల్లి బిడ్డలు పాసిపోయిన గుండె బరువెక్కే సంఘటనలు ఎన్నో.. కాటికి కాలు చాపిన పండు ముసలవ్వను ఇంటి వద్ద ఉంచి.. ముంబాయికి వలసలు వెళ్లి.. దిక్కులేనోళ్లుగా చచ్చిపోయిన సందర్భాలు ఈ తెలంగాణ నేల నిండా ఒక్కటా.. రెండా ఎన్నో గాయాలు.
మహారాష్ట్ర రైతులు, ఇతర ప్రముఖులు బీఆర్ఎస్లో చేరి కిసాన్ సర్కారుతో బతుకులను బాగుపరుచుకోవడానికి ముందుకు వస్తున్నారు. మరోవైపు మహారాష్ట్ర నలువైపులా, ఇటు కర్ణాటక ప్రాంతాల నుంచిచేరికలు జరుగుతూ బీఆర్ఎస్ పార్టీ వేగంగా విస్తరిస్తున్నది. అంటే మహారాష్ట్ర వాసులకు బీఆర్ఎస్ ప్రస్తుతం ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నది.
ఒకప్పుడు తెలంగాణలో ఏ గుండెను కదిలించినా రందితోనే ఉండేది. ఏడ్చి ఏడ్చి కన్నీటి చుక్కలు కూడా కరిగిపోయిన దుస్థితి. ఇటువంటి అనేక ఎతలు పారదోలడం కేవలం గుణాత్మకమైన మన పాలనతోనే, స్వరాష్ట్రంతోనే సాధ్యమని కేసీఆర్ దృఢం గా భావించారు. గుండెలనిండా బలమైన ఆత్మవిశ్వాసంతో ఆనాటి తెలంగాణ గడ్డ మూలమూలకు వెళ్లారు. తెలంగాణ నినాదాన్ని ఎత్తుకొని.. సైకిల్ యాత్రలు, పాదయాత్రలు చేశారు. గోసలతో, ఎతలతో నిండిన తెలంగాణకు భరోసానిచ్చారు.. ఇచ్చిన భరోసాకు తగ్గట్టుగానే చరిత్రను నిర్మిస్తూ.. ఇప్పుడు స్వరాష్ట్ర తెలంగాణకు ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చారు. ఇదంతా ఉద్యమ నాయకుని ముందుచూపుతోనే సాధ్యమైంది. అటువంటి మహానాయకుడు ఇప్పుడు దేశంకోసం మరోసారి పోరుబాట పట్టారు.
దేశంలోనే అత్యధిక ఆత్మహత్యలు చోటుచేసుకునే నేల మహారాష్ట్ర గడ్డకు ఆయన ఇప్పుడు పెద్ద భరోసాగా నిలుస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో అనేక సభలతో విజయవంతంగా బీఆర్ఎస్ను ప్రజల్లోకి తీసుకెళ్లిన కేసీఆర్.. ఇప్పుడు మరో కొత్త ప్రయోగం చేస్తున్నారు. హెలికాప్టర్ ద్వారా అరగంటలో మహారాష్ట్రలో ఉండే అవకా శం ఉన్నా.. ఆయన ఇప్పుడు ఓపికతో రో డ్డు మార్గాన్ని ఎంచుకున్నారు. బహు శా .. ఆయన మరింత క్షుణ్ణంగా మహారాష్ట్ర గడ్డను పరిశీలించి.. ఆ గడ్డకు కొండంత భరోసా ఇవ్వనున్నారు. తెలంగాణ ఉద్య మ సారథి, ముఖ్యమంత్రి కేసీఆర్ పండరీ పూర్ పర్యటన ఇప్పుడు దేశ రాజకీయా ల్లో ప్రకంపనం సృష్టిస్తున్నది.
నిజాం ఆధ్వర్యంలో హైదరాబాద్ సంస్థానం గా కొనసాగిన తెలంగాణలో మహారాష్ట్రలోని ఆరు జిల్లాలు, ఇటు కర్ణాటకలోని మూడు జిల్లా లు ఉండేవి. ఆ తర్వాతి పరిణామాల వల్ల ఆ రెండు ప్రాంతాలు తెలంగాణ నుంచి వేరుపడ్డా యి. కాగా తెలంగాణను బలవంతంగా ఆంధ్ర లో విలీనం చేయడంతో దాదాపు ఏడు దశాబ్దాలు ఈ గడ్డ పడ్డ గోస అందరికీ తెలిసిందే.. అయినప్పటికీ తెలంగాణ విముక్తి కోసం ఏ నా యకుడు బలంగా కొట్లాడిన దాఖలాలు లేవు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే సబ్బండ వర్గాల బతుకులు బాగుపడతాయని ఉద్యమ రథసారథి కేసీఆర్ బలమైన సంకల్పంతో రాష్ర్టాన్ని సాధించుకొన్నాం. 9 ఏండ్ల కాలంలోనే దేశానికే మార్గదర్శకంగా తెలంగాణ గడ్డను నిలుపుకు న్నం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఆరంభం..రాజకీయ ఎజెండాతోనే నాంది పలికింది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి సత్తాను చాటింది. ఆ ఎన్నికలతో తెలంగాణ ఉద్యమం ఓ శక్తిగా రూ పు దిద్దుకున్నది. ప్రస్తుతం కేసీఆర్ దేశంలో గు ణాత్మక మార్పు కోసం..కిసాన్ సర్కారును ని ర్మించడానికి బీఆర్ఎస్ను ఏర్పాటు చేశారు. త్వరలోనే మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసి బీ ఎర్ఎస్ బలాన్ని నిరూపించుకునేలా పార్టీ వర్గాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
బీఆర్ఎస్ రాకతో మహారాష్ట్ర వాసుల్లో నూతన ఉత్సాహం నెలకొన్నది. ఆదిలాబాద్‌కు ఆనుకొని ఉన్న మహారాష్ట్రకు చెందిన అనేక పల్లెలు తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని ఆనాడే తీర్మానాలు చేశాయంటే.. అప్పటి నుంచే అక్కడి ప్రజలకు కేసీఆర్ నాయకత్వం పట్ల సుదీర్ఘమైన విశ్వాసం ఉన్నదన్న సంగతి గమనించవచ్చు. ఇటీవల బీఆర్ఎస్ ఆవిర్భావ సభ అనంతరం రెండో సభ మహారాష్ట్రలోని నాందేడ్‌లో నిర్వహించారు. దీంతో అక్కడి ప్రాంత వాసుల నుంచి విశే ష ఆదరణ వచ్చింది. తమ గోసలు తీర్చే నాయకుడు కేసీఆర్ అనే నమ్మకాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం భారతదేశంలోనే రైతుల ఆత్మహత్య లు అధికంగా మహారాష్ట్రలోనే ఉండడం బాధాకరం. మహారాష్ట్ర మీదుగా తెలంగాణకు వచ్చే గో దావరి, మంజీర నదుల నీటి వనరులను రైతాంగానికి అందించడంలో అక్కడి పాలకుల నిర్లక్ష్యం తీవ్రంగా కనిపిస్తున్నది. దీంతో దశాబ్దాలుగా మహారాష్ట్రలోని ప్రజల బతుకులు మారడం లే దు. మరోవైపు ఇటు తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో ముంబాయికి వలసలు ఉండేవి. అయి తే ఆయా ప్రాంతాల్లో తెలుగు వారు వివిధ వ్యా పారాలతో నివాసాల్ని ఏర్పాటు చేసుకున్నారు.
ప్రస్తుతం ఇది కూడా బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉన్నది. సీఎం కేసీఆర్ దూరదృష్టితో మహారాష్ట్రలోని గోసను విముక్తి చేయడానికి పక్కా ప్రణాళికలను ప్రక టించడంతో మహారాష్ట్ర వాసులకు కేసీఆర్ ఆశాకిరణంలా మారా రు. దేశ వ్యాప్తంగా రైతు సంక్షేమమే ఏకైక ఎజెండాగా ముందుకు వస్తున్న కేసీఆర్ మొదటగా కిసాన్‌సెల్ బాధ్యులను ఆయా రాష్ర్టాలకు నియమిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కిసాన్‌సెల్ అధ్యక్షునిగా మాణిక్ కదమ్‌ను నియమించారు. దీంతో అక్కడ రైతులు, ఇతర ప్రముఖులు బీఆర్ఎస్లో చేరి కిసాన్ సర్కారుతో బతుకులను బాగుపరుచుకోవడానికి ముందుకు వస్తున్నారు. మరోవైపు మహారాష్ట్ర నలువైపులా, ఇటు కర్ణాటక ప్రాంతాల నుంచి చేరికలు జరుగుతూ బీఆర్ఎస్ పార్టీ వేగంగా విస్తరిస్తున్నది. అంటే మహారాష్ట్ర వాసులకు బీఆర్ఎస్ ప్రస్తుతం ప్రత్యామ్నాయం గా కనిపిస్తున్నది.
బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం సైతం స్పష్టమైన లక్ష్యాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఇటీవల మహారాష్ట్రకు ఆయా ఇన్ఛార్జ్జీలను సైతం నియమించింది. పార్టీ సభ్యత్వం ప్రారంభించింది. చాలామంది సభ్యత్వం తీసుకుంటూ బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారు. తెలంగాణలో అమలయ్యే సంక్షేమ పథకాలు, జీవితాలు తమకూ కావాలంటే బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నారు.అనేక దశాబ్దాలుగా ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చి పరిపాలిస్తున్నప్పటికీ.. మహారాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు. అందుకే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పై ప్రత్యేక దృష్టి సారించారు.
బీఆర్ఎస్ మొదటిసారిగా అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించిం ది. తద్వారా మహారాష్ట్రలోనూ సత్తా చాటి దేశానికి ఓ సందేశాన్ని ఇవ్వడానికి సిద్ధమైంది. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కారు’అంటూ కదిలిన కేసీఆర్ నిర్ణయాలకు మెజారిటీ ప్రజలు మద్దతు పలుకుతున్నారు. ఇప్పటికే వడివడిగా విస్తరిస్తున్న భారత రాష్ట్ర సమితికి.. మహారాష్ట్ర మణిహారంగా నిలవనున్నది.
(వ్యాసకర్త : దళిత విద్యార్థి నాయకుడు)
సంపత్ గడ్డం
78933 03516