KCR | తెలంగాణలో సాగుతున్న ప్రగతి ప్రస్థానం, ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనా విధా నం ఈ ప్రాంత వాసులనే కాదు, పొరుగు రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వాసులను కూడా ఆకట్టుకుంటున్నది. కేవలం ఆకర్షించడమే కాదు, వాళ్లు ప్రత్యేకంగా ఫోన్లు చేసి, వ్యాసాలు రాసి స్పందించేంతగా కదిలిస్తున్నది. ఒకప్పుడు తెలంగాణలో ఉండి, తర్వాత తమ ప్రాంతాలకు వెళ్లి, తిరిగి తెలంగాణకు వచ్చినవాళ్లయితే ఈ తొమ్మిదేండ్లలో ఇక్కడ వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇదొకప్పుడు తాము చూసి న తెలంగాణేనా అని తమను తామే ప్రశ్నించు కుంటున్నారు. ఇలాంటి అభివృద్ధి తమ ప్రాంతా ల్లో ఎందుకు జరగడం లేదని, అందుకు కారకులు, కారణాలేమిటని ప్రశ్నిస్తున్నారు. మొన్నటికి మొన్న యాదగిరిగుట్టను సందర్శించిన నిడదవోలు పూర్ణచందర్ అనే రచయిత వ్యాసం రాసిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కృష్ణంరాజు అనే పాఠకుడు ‘నమస్తే తెలంగాణ’ వ్యాస్తకర్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పంజుగుల శ్రీశైల్రెడ్డికి ఫోన్‌చేసి మరీ తన మనోగతాన్ని పంచుకున్నారు. తమకు కేసీఆర్ వంటి నాయకుడు కావాలని, ఆయన ఏపీకి వస్తే సంపూర్ణంగా స్వాగతిస్తామని పేర్కొన్నారు. శ్రీశైల్రెడ్డితో ఫోన్ సంభాషణలో కృష్ణంరాజు వ్యక్తం చేసిన అభిప్రాయ సారాంశం ఇదీ…
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని వేండ్ర గ్రామానికి చెందిన నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణలోని సంగారెడ్డి ప్రాంతానికి వెళ్లాను. అక్కడ నాకు కనీసం తాగడానికి కూడా నీళ్లు దొరకలేదు. నేను మళ్లీ 2018లో అదే ప్రాంతానికి వెళ్లాను. అప్పటికీ తెలంగాణ వచ్చి నాలుగేండ్లే అవుతున్నది. ఆ సమయంలో తాగడానికి మంచినీళ్లే కాదు, పంటలకు పారే సాగునీటికీ కొదవ లేకుండా పోయింది.
నా మాటలను ఒక సామాన్యుడి వలె స్వీకరించాలని, తన అభిప్రాయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలిసేలా కృషిచేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా.. మా ప్రాంతంలో ని ‘వేండ్ర’ రైల్వేస్టేషన్ గత ఇరువై ఏండ్లుగా ఎం తోమంది ప్రజలకు ఉపయోగపడింది, ఇప్పు డు ఆ రైల్వేస్టేషన్లో చెట్లు ఏపుగా పెరిగినా పట్టించుకునే నాథుడే లేడు. చీకటయ్యిందంటే చాలు మహిళలు అటువైపు వెళ్లడానికే భయపడిపోతున్నారు. ‘వందేభారత్’ రైలును పదేపదే ప్రారంభిస్తూ గొప్పలకు పోతున్న ప్రధాని మోదీ సంగతి ఇక తేల్చాల్సిన సమయం ఆసన్నమైంది. నా మద్దతు బీఆర్ఎస్కు, దేశ్ కీ నేత అయిన ‘కేసీఆర్’కే అని తెలియజేస్తున్నా…
ఏ వ్యక్తి అయినా ఆపదలో ఉన్నడని తెలిస్తే చాలు, అక్కున చేర్చుకునే మనస్తత్వం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ది. అభం, శుభం తెలియని ఒక యువతిని కుటుంబసభ్యులు మానసిక క్షోభ కు గురిచేస్తే ఆ అమ్మాయిని అక్కున చేర్చుకొని, అన్నం పెట్టిన చెయ్యి ఆయనది. ఆ సంఘటన కండ్లారా చూసిన నేను కంటతడి పెట్టాను. మనసున్న నేతలే ఇలా చేస్తారు.
రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకువెళ్తున్న తరుణంలో యువతకు అండగా నిలుస్తూ, రాష్ర్టాభివృద్ధిలో తనదైన పాత్ర పోషిస్తూ తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటున్నారు మంత్రి కల్వకుంట్ల తారకరామారావు. రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీరంగాన్ని జిల్లా కేంద్రాలకు విస్తృతపరిచి యువతకు అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. అంతేకాకుం డా కేటీఆర్ మంచి వక్త. విదేశాల్లో ఆయన చేసిన ఎన్నో ప్రసంగాలు ఈ విషయాన్ని ప్రజలకు తెలియపరుస్తున్నాయి. ఇక మంత్రి హరీశ్‌రావు గురిం చి ఎంత చెప్పుకొన్నా తక్కువే. ‘నాయకుడంటే ఇలానే ఉండాలి’ అని ప్రజల చేత ప్రశంసలు పొందుతూ గత కొన్నేండ్లుగా ప్రజాభిమానాన్ని చూరగొంటున్నారు. ప్రజలకు ఏ ఆపద వచ్చినా మొదట గుర్తొచ్చే నాయకుడు హరీశ్‌రావు అనడంలో సందేహం లేదు. ఇలా.. మనసున్న నాయకులకు కేరాఫ్ అడ్రస్ తెలంగాణ అయింది.
రాష్ట్రం బాగుపడాలంటే మనసున్న నాయకుడొక్కరు చాలు. కానీ, తెలంగాణలో అలాంటి నాయకులకు కొదవ లేదు. ఉన్నదల్లా మా ఏపీకే.. మాకు కూడా మనసున్న నాయకులు కావాలె. ఒక్క ఏపీకే కాదు, ఈ దేశానికే మనసున్న నాయకుడు కావాలె. బీఆర్ఎస్తో దేశ రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తున్నా. ఒక్క నేనే కాదు, నాలాంటి ఎంతోమంది సామాన్యులు బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ లాంటి నాయకుడిని కోరుకుంటున్నారు. ఏ రాష్ట్ర ప్రజలై నా అభివృద్ధి చేసే నాయకుడినే ఎన్నుకొంటారు. కానీ, మేం తప్పు చేశాం. ఆ తప్పును పునరావృతం చేయబోము. అందుకే ఏపీలోనూ బీఆర్ఎస్ను బలపరుస్తాం. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు లాంటి మనసున్న నాయకులు మాకూ కావాలె.