‘హరిహర బ్రహ్మాదులు అడ్డమొచ్చినా నీ తాత జేజమ్మలు అడ్డమొచ్చినా కోటి మంది చంద్రబాబు నాయుళ్లు కొంగ జపాలు చేసినా మీ కళ్ల ముందే పాలమూరు ప్రాజెక్ట్ కట్టి చూపిసా’్త 2015 జూన్ 11న పాలమూరు ప్రాజెక్ట్ శంకుస్థాపన సందర్భంగా సీఎం కేసీఆర్ అన్న మాటలివి. ఇచ్చిన హామీ ప్రకారం ఆయన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి చూపించారు. అర్జునుడికి లక్ష్యంపై ఎంత గురి ఉండేదో కేసీఆర్‌కు అంతే గురి ఉంటుంది. లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా డోంట్ కేర్ అంటూ ముందుకు సాగిపోయి విజయాన్ని సాధించడమే ఆయన శైలి.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో అటు ఆంధ్రా పాలకులు, ఇటు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కేసులు వేసి ఎన్ని అడ్డంకులు సృష్టించినా కేసీఆర్ మాత్రం తన సవాల్ మర్చిపోలే. పట్టు వీడని సంకల్పంతో ముందుకు పోయిండ్రు. అన్ని అడ్డంకులు తొలిగిపోయినయి. హామీ ఇచ్చిన ప్రాజెక్టును ప్రజలకు కానుకగా ఇచ్చారు కేసీఆర్.
తన సంకల్పం మీద ఎంత గట్టి నమ్మకం ఉంటే ఆయన ఈ మాట అనాలె. దేశంలో గొప్ప గొప్ప లీడర్లుగా కీర్తించబడ్డ నాయకులు కూడా ఓ కార్యం భుజాలకెత్తుకున్నప్పుడు ప్రజలకు ఇట్ల భరోసా ఇచ్చే ధైర్యం చేయలే. కానీ కేసీఆర్ వేరు. ఒక పని అనుకున్నడంటే లక్ష్యం వైపు సాగే క్రమంలో వచ్చే అడ్డంకులను డోంట్ కేర్ అంటరు. అంతిమంగా టార్గెట్ పూర్తి చేయటమే ఆయన ైస్టెల్. ఒక రుషికి ఉండే సంకల్పం కలిగిన వ్యక్తి కనుకే ఊహకందని, అసాధ్యమనుకున్న పనులన్నీ సాధ్యం చేసి చూపిస్తున్నారు.
ధీరులు మాత్రమే తాము చేయాలనుకున్న పని పూర్తి చేస్తుంటారని ‘ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై’ పద్యం గురించి కేసీఆర్ తరచూ చెప్తుంటారు. ఆ పద్యంలో చెప్పిన ధీరుడి లక్షణాలు కేసీఆర్‌లో నిండుగా ఉన్నాయి. ఆయన ఏ పని చేపట్టినా దాని అంతు చూడకుండా వదిలిపెట్టలే. అది తెలంగాణ సాధన కావచ్చు. ఆ తర్వాత రాష్ట్ర పునర్నిర్మాణం కావొచ్చు. ఏది చేసినా అదో చరిత్ర.
ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు జీవిత కాలంలో సాధించలేని ఎన్నో ఘనతలను కేసీఆర్ సాధించారు! మానవ మాత్రులకు సాధ్యమేనా అనే రీతిలో ఆయన విజన్ ఉంటుంది. అందుకే కేసీఆర్ ఏదైనా చేసి తీరుతానని చెప్పిన వెంటనే చాలామంది అది అయ్యే పని కాదంటూ పెదవి విరుపులు షురూ చేస్తారు. ఇంకొంతమంది సవాళ్లు విసురుతారు. నిజానికి అది వాళ్ల తప్పు కూడా కాదు. మానవ మేధస్సును అంచనా వేయటంలో వాళ్లు కేసీఆర్‌కు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉండటమే కారణం. ఇలాంటి వాళ్లను కేసీఆర్ వదిలిపెట్టరు. సవాల్ విసిరిన వాళ్లను తుక్కుతుక్కుగా ఓడిస్తారు. అలా ఓడిపోయిన వాళ్లలో చాలా మంది ప్రముఖులని చెప్పుకుంటున్న వాళ్లు ఉన్నారు.
కేసీఆర్ వర్కింగ్ ైస్టెల్ ప్రత్యేకం. స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఆయన తాను అనుకున్న పని స్టార్ట్ చేస్తారు. ఒక్కసారి కమిట్ అయ్యారంటే తన మాట తనే వినరు. తెలంగాణ విషయంలో వెనక్కిపోతే రాళ్లతో కొట్టి చంపండనేంత ధైర్యం ఎవరిది? తన లక్ష్యం మీద ఎంత కసి ఉందో చెప్పే స్టేట్మెంట్ అది. ఆయన కసి, కమిట్ మెంట్ కారణంగానే తెలంగాణ కల సాకారమైంది. 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటంలో ఎన్నెన్నో అవాంతరాలు, అడ్డంకులు. అయినా సరే కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిండ్రు. నిజానికి తెలంగాణ సాధకుడిగా కేసీఆర్ జీవితం ధన్యమైనట్లే. లైఫ్‌టైమ్‌లో ఇంతకన్నా సంతృప్తినిచ్చే అంశం ఇంకేముంటుంది. కానీ కేసీఆర్ అక్కడితో తృప్తి చెందలే. సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చాలని కంకణం కట్టుకున్నారు. అందుకే తెలంగాణ ఉద్యమం నాటి కన్నా రెట్టించిన మేధోమథనం చేస్తున్నారు. తాను అనుకున్నది సాధించే క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ అయితలే. రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ అవే డేర్ స్టేట్ మెంట్లు. అంతే కమిట్ మెంట్.
తెలంగాణ పునర్నిర్మాణంలో ఆయన విజన్‌తో పని చేస్తున్నారు. ఇంటింటికీ మంచి నీళ్లు అందించే విషయంలో ఆయన చేసిన ఛాలెంజ్…ఉద్యమం నాటి స్ఫూర్తిని గుర్తు చేసేదే. వందేండ్ల తెలంగాణ సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తును కాంక్షించి కేసీఆర్ చేపడుతున్న ప్రతి పనిని అది సాధ్యమా అంటూ కొందరు బిత్తిరి ప్రశ్నలు వేస్తున్నారు. అలాంటి వాళ్లందరికీ దిమ్మ తిరిగేలా ఒక్కొక్క అద్భుతాన్ని కేసీఆర్ ఆవిష్కరిస్తున్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో అటు ఆంధ్రా పాలకులు, ఇటు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కేసులు వేసి ఎన్ని అడ్డంకులు సృష్టించినా కేసీఆర్ మాత్రం తన సవాల్ మర్చిపోలే. పట్టు వీడని సంకల్పంతో ముందుకు పోయిండ్రు. అన్ని అడ్డంకులు తొలిగిపోయినయి. హామీ ఇచ్చిన ప్రాజెక్టును ప్రజలకు కానుకగా ఇచ్చారు కేసీఆర్.
ఐతే గత 9 ఏండ్లలో కేసీఆర్‌కు పాలన చేతకాదన్నోళ్లు, రైతులకు 24 గంటల ఉచిత్ కరెంట్ సాధ్యం కాదన్నోళ్లు, 33 జిల్లాల ఏర్పాటు కష్టమన్నోళ్లు, జిల్లాకో మెడికల్ కాలేజ్ ఎట్ల తెస్తరన్నోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదన్నోళ్లు, రైతుబంధు ఇవ్వరన్నోళ్లు, దళిత బంధు రాజకీయాల కోసమన్నోళ్లు, రైతు బీమా రాదన్నోళ్లు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేరన్నోళ్లు ఇప్పుడు కంటికి కనిపించటం లేదు. ఒక్క విషయంలో కూడా వాళ్లు కేసీఆర్ మీద పైచేయి సాధించలేకపోతున్నారు. నిజానికి ఇవే అద్భుతాలు వేరే నేతలెవరైనా చేసి ఉంటే అతడు మొత్తం విశ్వానికే గురువు, చంద్రుడు, ఇంద్రుడు అని ఆకాశానికెత్తేసే వాళ్లు. కానీ ఇదంతా కేసీఆర్ అనే బక్క పలచని వ్యక్తి కారణంగా సాధ్యమవటం వాళ్లకు జీర్ణమవటం లేదు.
ఇంగ్లీష్‌లో అల్కెమిస్ట్ అనే ఓ పుస్తకం ఉంటది. మనస్ఫూర్తిగా, బలంగా ఏదైనా సంకల్పం తీసుకున్న వ్యక్తులకు ఈ ప్రపంచం మొత్తం సహకరించి ఆ సంకల్పాన్ని నెరవేరుస్తుందని అందులో ఓ సూక్తి ఉంటది. సీఎం కేసీఆర్ కూడా ప్రజల కోసం బలమైన సంకల్పం తీసుకుంటున్నారు
గనుక కచ్చితంగా మొత్తం విశ్వమే ఆయన సంకల్పాలన్నింటినీ నేరవేరుస్తున్నట్టుంది.
ఇటీవలే సూపర్‌స్టార్ రజినీకాంత్ సైతం ఓ సూపర్ డైలాగ్ చెప్పిండు. మొరగని కుక్క లేదు.. విమర్శించని నోరు లేదు. ఆ రెండు లేని ఊరు లేదు. కాబట్టి మన పని మనం చేసుకుంటూ పోవాలి అన్నారు. సీఎం కేసీఆర్ కూడా అంతే. విమర్శలు చేసే వాళ్లను పట్టించుకోకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నారు.
-రచ్చ దినేష్
89787 40475