ఈ మధ్య కొంతమంది కుహనా జర్నలిస్టులు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడిచినా.. ఇస్తామన్న ఆరు గ్యారెంటీలను అమలు పరచనందుకు అధికార పక్షాన్ని ప్రశ్నించకుండా, కేవలం సంకుచిత రాజకీయ ధోరణితో ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను ప్రశ్నించడం హాస్యాస్పదం.
ఉద్యమంలో కదం తొక్కిన యువతరానికి ఉపాధి కల్పించేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన లక్ష ఉద్యోగాల హామీని మించి 2.20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. ప్రైవేట్ రంగంలో 23 వేల పరిశ్రమలకు శరవేగంగా అనుమతినిచ్చి, ఏకంగా 24 లక్షల మందికి ఉపాధి కల్పించింది.
ఈ మధ్యే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన సంగతి గమనిస్తే.. ఇలా రాష్ర్టానికి అన్యాయం చేస్తే సహించేది లేదని, రెండేండ్లుగా ఓపిక పట్టామని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. కృష్ణా నదీ జలాల వాటాలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, డీపీఆర్‌ను కేంద్రం వెనక్కి పంపినా… రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ర్టానికి అన్యాయం జరిగితే ఊరుకోనని, తానే స్వయంగా రంగంలోకి దిగుతానని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతగా ఆయన తన పాత్రను బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నారు. అలాంటి నేత గురించి తక్కువజేసి రాయడం దారుణం!
ఈ సందర్భంలో తన పదేండ్ల పాలనలో రాష్ర్టాన్ని కేసీఆర్ అభివృద్ధి చేసిన తీరు ఒకసారి గుర్తుకు చేసుకోవాల్సిందే. ప్రపంచంలోని అతి పెద్ద ఎత్తిపోతల పథకంతో భూతల్లి దాహార్తి తీర్చిన అపర భగీరథుడు ఆయన. ఆయన మానస పుత్రిక కాళేశ్వరం తెలంగాణకు ఓ వరప్రదాయిని. భారతదేశంలో 75 ఏండ్లలో 7.7 శాతం సాగు విస్తీర్ణం పెరిగితే, అదే కాలంలో తెలంగాణలో 17.7 శాతం సాగు పెరగడానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్టేనన్నది జగమెరిగిన సత్యం. వ్యవసాయాన్ని పండగలా మార్చిన ఘనత కేసీఆర్‌ది. దీంతో ఎన్నారైలు సైతం లక్షల రూపాయల జీతాలను వదులుకొని వ్యవసాయరంగాన్ని వృత్తిగా ఎంచుకుంటున్నారు.
కేసీఆర్ పాలనలో వ్యవసాయం, పరిశ్రమలు.. ఇలా అన్ని రంగాలు ప్రగతి బాటలో నడిచాయి. తెలంగాణ సాధించిన సమగ్ర, సమ్మిళిత ప్రగతి యావత్ దేశానికే స్ఫూర్తిగా నిలిచింది. హరితహారం వంటి కార్యక్రమాలతో రాష్ట్రంలో పచ్చదనం 18 శాతం నుంచి 31.50 శాతానికి పెరిగింది. ప్రజలే కేంద్రంగా సాగిన సంస్కరణల పథంలో ప్రతి చట్టం ప్రతిష్టాత్మకంగా అమలైంది. పరిశ్రమలకు శరవేగంగా అనుమతులిచ్చే టీఎస్ ఐపాస్, భవనాలకు అనుమతులిచ్చే టీఎస్ బీపాస్, నూతన జిల్లాల ఏర్పాటు వంటివన్నీ రాష్ట్ర ప్రగతికి లోతైన అధ్యయనంతో చేసిన సరికొత్త ఆలోచనలే.
ఉద్యమంలో కదం తొక్కిన యువతరానికి ఉపాధి కల్పించేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన లక్ష ఉద్యోగాల హామీని మించి 2.20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. ప్రైవేట్ రంగంలో 23 వేల పరిశ్రమలకు శరవేగంగాఅనుమతినిచ్చి, ఏకంగా 24 లక్షల మందికి ఉపాధి కల్పించింది. సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చి వారిని కంటికి రెప్పలా చూసుకొంది. కేంద్ర ప్రభుత్వంతో సమానంగా వారికి వేతనాలు ఇచ్చింది! ప్రభుత్వ ఉద్యోగాల్లో 33 శాతం స్థానిక రిజర్వేషన్లు కేసీఆర్ ప్రభుత్వం సాధించలేదా? తెలంగాణ వస్తే పరిశ్రమలు తరలిపోతాయనే అపోహకు పాతరేసి పెట్టుబడులకు రాష్ర్టాన్ని స్వర్గధామంగా మలచిన తీరు, హైదరాబాదును ఆర్థిక ఇంజిన్‌గా తీర్చిదిద్దిన విధానం తెలంగాణ అసాధారణమని పారిశ్రామికవేత్తలు కొనియాడలేదా? తెలంగాణ బాపు కేసీఆర్ అడగకున్నా అన్నీ సమకూర్చారు. అందుకే ఈ విలువ లేని వాళ్ల దగ్గర నిలువ లేకున్నడు. అందుకే అన్నారు పెద్దలు చీకటి వస్తేనే వెలుగుకు విలువ అని!
తెలంగాణ రాష్ర్టాన్ని పరిపాలించమని ప్రజలు నాడు కేసీఆర్‌కు పట్టం కడితే ‘మీకు పగ్గాలిచ్చారు.. మీ కొడుకును ఎట్ల మెచ్చుతరని ఎట్లా అనుకుంటవ్ సారూ’ అని కారు కూతలు కూసే వారికి నేను చెప్పే జవాబు ఇదే… అరె బై .. అది వంశ పారంపర్యంగా వచ్చిన క్వాలిటీ ఆఫ్ లీడర్షిప్. నాయకత్వ లక్షణాలు మెండుగా కలిగిన కేటీఆర్ ఐటీ రంగంలో తెలంగాణను దూసుకుపోయేలా చేయలేదా? దాని వల్ల రాష్ర్టానికి పెట్టుబడుల వరద పారేలా చెయ్యలేదా! ఫార్చూన్ 500 కంపెనీల్లో స్థానం పొందిన 20కి పైగా బహుళ జాతీయ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సంగతి మీకు ఎరుక లేదా. తమ పదేండ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషికి ఇదే నిదర్శనం. నేతన్నల వస్త్ర పరిశ్రమ గమనాన్ని మార్చిన బతుకమ్మ చీర సృష్టికర్త కేటీఆర్ అని మరిచితిరా? నేతన్నల శతాబ్దాల సమస్యలకు, సంక్షోభాలకు తెర దించి వారిని ఆత్మ విశ్వాసంతో తలెత్తుకొనేలా వారి ఆదాయాన్ని పెంచింది అప్పటి చేనేత జౌళి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కాదా..!
తెలంగాణ సోయి లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఆయనకు చెంచాగిరి చేస్తున్న కొంతమంది జర్నలిస్టులకు రైతు రుణ మాఫీ, 200 యూనిట్ల ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ల పంపిణీ, రూ.500కే గ్యాస్ కనెక్షన్, ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు తులం బంగారం, మహిళలను కోటీశ్వరులను చేసే ప్రణాళిక.. ఇలా అధ్వానంగా అమలవుతున్న, అసలే అమలు కాని 420 పథకాలను కాంగ్రెస్ సర్కారు ప్రకటించింది! కేసీఆర్ గురుకులాలను స్థాపించి సాధారణ విద్యార్థులకు సైతం కార్పొరేట్ విద్యనందించిండు. రేవంత్ ప్రభుత్వం మాత్రం ఫుడ్ పాయిజన్ఘటనలతో విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తున్న దుస్థితి మీకు కనిపించడం లేదా ?
ధర్నా చౌక్ ఎత్తేసిండని, ఫోన్ ట్యాపింగ్ చేశారనే చీప్ ట్రిక్‌లతో రాజకీయాలు చేసేది హస్తం పార్టీ నాయకులే. అభివృద్ధి అవసరాన్ని వినూత్న పద్ధతిలో చెప్పి, ప్రజలందరి విశ్వాసాన్ని చూరగొన్న ఘనత కేసీఆర్‌దే. నదికి నీళ్లిచ్చిన కేసీఆర్ పాలనను జీర్ణించుకోలేక విమర్శిస్తూ కుయుక్తులు పాటిస్తున్న విమర్శకులకు ఇది నా జవాబు.
ఆర్ఆర్ఆర్