శరీరే జర్జరీ భూతే
వ్యాధిగ్రస్తే కళేబరే
ఔషధం జాహ్నవీతోయం
వైద్యో నారాయణో హరిః॥
కృశించిపోయే లక్షణం గల, వ్యాధిగ్రస్తమైన ఈ శరీరానికి నిజమైన ఔషధం గంగాజలం. నారాయణుడే వైద్యుడు. శరీరం ధరించిన జీవుడు తనలోని జన్మాంతర పాప పంకిలాన్ని శుద్ధి చేసుకోవడం ముఖ్య కర్తవ్యం. అందుకు పవిత్ర గంగాజల స్నానం, శ్రీహరి నామస్మరణ అనేవి రెండే సాధనాలు. అందుకే శరీర సౌందర్యం కోసం, పటుత్వం కోసమో మనిషి తాపత్రయ పడకుండా.., అంతఃశుద్ధి కోసం మనిషి నిరంతరం తపించాలి, కృషి చేయాలి. అప్పుడే నిజమైన ఆరోగ్యం, ఆనందం మనిషి దరిచేరుతుంది.
టి.సుధాకరశర్మ